1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Friend

అమలాపాల్‌ స్నేహితురాలు మాత్రమే!

అమలాపాల్
File
FILE
సినిమా ఇండస్ట్రీలో దర్శకులతో హీరోయిన్లు ఎఫైర్లు పెట్టుకోవడం సహజమే. ఈ విషయంలో ఒక్క టాలీవుడ్, కోలీవుడ్ అనేది తేడా లేదు. సియనా విక్రం హీరోగా నటించి విడుదలైన నాన్న చిత్రంలో హీరోయిన్‌గా అమలాపాల్‌ను దర్శకుడు విజయ్ పరిచయం చేశాడు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో వీరిద్దరు చాలా సన్నిహితంగా ఉన్నట్టు పుకార్లు వచ్చాయి.

తాను చేయబోయే కొత్త చిత్రాల గురించి దర్శకుడు విజయ్‌తో అమలాపాల్ చర్చిస్తుండేదట. తగిన సలహాలు కూడా విజయ్‌ ఇస్తుంటాడని సమాచారం. ఇలా వీరిద్దరు వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా గడుపుతుంటారు.

ఈ విషయమైన దర్శకుడు విజయ్‌ మాత్రం... అవన్నీ పుకార్లేనని... ఇండస్ట్రీలో అమ్మాయి, అబ్బాయి కలిసి చర్చించుకోవడం.. కలుసుకోవడం షరా మామూలేనని... మా ఇద్దరి మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందని తేల్చి చెప్పాడు. మరి అమలాపాల్‌ ఏమంటుందో చూడాలి.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి