1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Tollywood

Tamanna | Tollywood | తమన్నాకు ప్రపంచమంతా అక్కడే ఉందట

తమన్నా
మనం ఏ పనైనా చేయాలనుకుంటే అందులో లోతుపాతుల్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. కొన్నిసార్లు తొందరపాటుతో తీసుకునే నిర్ణయం తప్పు కావచ్చు. అందుకే పెద్దల సలహాలు కూడా తీసుకోవాలి. 

నేను కూడా మా పెద్దల సలహాతోనే రంగుల లోకంలోకి వచ్చాను. చాలామంది వద్దనీ, జాగ్రత్త అని భయపెట్టారు. ఈ రంగంలోకి రావడానికి కారణం నా అభిరుచే. ఇక్కడికి వచ్చాక చాలా విషయాలు నేర్చుకున్నా. అసలు ప్రపంచమంతా ఇక్కడే ఉందనిపిస్తుంది.

ఎంతోమంది మనుషులు, మనస్తత్వాలు ఒక సైకాలజీ బుక్‌లా ఉంటుంది. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే.. మనం ఎవరికీ భయపడాల్సిన పనిలేదని చెప్పుకొచ్చింది తమన్నా. 2012లో కొత్త నిర్ణయాలు ఏమీలేవనీ, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని అంది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT