1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Sexy Look

Taapsi | Sexy Look | Gundello Godari | ఇక నుంచి నేను చూపించను గాక చూపించను: తాప్సీ

తాప్సి
ఎక్స్‌పోజింగ్ చేసి తాప్సికి విసుగెత్తింతో ఏమోగానీ ఇక నుంచి లంగా ఓణీ పాత్రలకే పరిమితమవుతానంటోందట. ఝుమ్మంది నాదం చిత్రంతో తెరంగేట్రం చేసి గ్లామర్ అందాలను సాధ్యమైనంత ఎక్కువగా ప్రదర్శించిన తాప్సీకి చెప్పుకోదగ్గ "బ్రేకులు" రాలేదు. 

దీంతో ఆ అందాల ప్రదర్శనకు ఫుల్‌స్టాప్ పెట్టేయాలనుకుంటోందట. అనుకోవడమే కాదు.. అటువంటి సినిమాల్లో నటించేందుకు సై అంటోందట. మంచు లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్న గుండెల్లో గోదారి చిత్రంలో అచ్చమైన తెలుగమ్మాయిలా లంగా ఓణీతో నటిస్తోందట.

ఈ చిత్రంలో సరళ పేరుతో నటిస్తున్న తాప్సీ ఆ పాత్ర తనకు గంపెడు అవకాశాలను తెస్తుందని ఖుషీగా చెపుతోందట. గ్లామర్ ఇండస్ట్రీలో గ్లామర్ అందాలను చూపకుండా తాప్సి ఎలా నెట్టుకొస్తుందా చూడాల్సిందే.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT