1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Prabhudeva

Nayanatara | Prabhudeva | Differences | Kollywood | ప్రభుదేవా - నయనతారలకు చెడిందట.. "పచ్చి" కొట్టుకున్నారట

నయనతార
WD
శ్రీరామరాజ్యం "సీత" నయనతారను ప్రభుదేవా వదిలేశాడట. ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా మనస్పర్థలు తలెత్తాయనీ, అందువల్ల విడిపోవడమే బెటరనే నిర్ణయానికి వచ్చారని కోలీవుడ్ సినీజనం ఒకటే గోల చేస్తున్నారు.

నయనతార - ప్రభుదేవాల మధ్య గ్యాప్ రావడానికి ప్రధాన కారణం ప్రభు ఇతర హీరోయిన్లతో చనువుగా ఉండటమేనట. పెళ్లి చేసుకునే ముందే ఇలా ఉంటే.. ఇక పెళ్లయిన తర్వాత ఎలా ఉంటాడోనన్న బెంగ నయనతారను పట్టి పీడించిందట. దీంతో వాళ్లతో స్నేహం ఆపేయాలని నయన గట్టిగా కోరిందట. కానీ ప్రభుదేవా మాత్రం నయనతార మాటను పూచికపుల్ల మాదిరిగా తీసి పారేశాడట.

ఈ పరిస్థితుల్లో ప్రభుదేవాతో ఉండటం కష్టమని నయన భావిస్తోందనీ, అందువల్లనే తిరిగి సినిమాల్లో నటిస్తానని ఇటీవల సందేశాలను పంపిస్తోందని చెప్పుకుంటున్నారు. దీనిపై నయనతార - ప్రభుదేవాలు ఏవంటారో చూడాలి మరి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT