Katria Kaif, Rajani Kanth, Kamal Hasan, Tamil | తమిళ సూపర్‌స్టార్లతో నటించడం లేదు : కత్రినా కైఫ్
File
FILEతమిళంలో కత్రినా కైఫ్ రెండు సినిమాలు చేయడానికి ఒప్పుకుందనీ, ఒక్కో సినిమా చేయడానికి రూ.5 కోట్లు వసూలు చేస్తుదన్న ప్రచారం జోరుగా సాగిన విషయం తెల్సిందే. దీనిపై కైఫ్ స్పందిస్తూ... తాను కానీ, తన మేనేజర్‌ని కానీ ఈ సినిమాల కోసం ఎవరూ సంప్రదించలేదన్నారు.
రజనీకాంత్ కూతురు సౌందర్య నిర్మిస్తున్న 'కొచ్చడయ్యాన్' సినిమాలో రజనీ సరసన కత్రినా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా కోసం కత్రినా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కథ ఆమెకి ఎంతగానో నచ్చిందని ఆ మధ్య స్వయంగా చెప్పింది సౌందర్య.
తాజా సమాచారం ప్రకారం 'కొచ్చడయ్యాన్'లో నాయికగా దీపికా పదుకోనే ఖాయమైంది. నాన్న సరసన 'కొచ్చడయ్యాన్'లో నటించేందుకు దీపిక కన్ఫార్మ్ అయ్యింది అని ట్విట్టర్ ద్వారా తెలిపింది సౌందర్య.
