Vidyabalan | Youtube | Siddardh roy Kapoor | Love | Marriage | త్వరలో ఓ ఇంటికి కోడలు కానున్న కుర్రాళ్ళ కలలరాణి!!
File
FILEగతంలో ఇలాంటి వార్త విన్నప్పుడల్లా ఖండించిన విద్య ఈ సారి మాత్రం సానుకూలంగా సంకేతాలు ఇవ్వడం గమనార్హం. విద్యాబాలన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ తమ పెళ్ళి గురించి పెదవి విప్పడం లేదు కానీ, ఇద్దరూ కలసి చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు.
రాబోయే రెండేళ్ళ వరకు పలు వైవిధ్యమైన పాత్రలను అంగీకరించానని, ఇప్పట్లో పెళ్ళి ప్రసక్తే లేదని విద్య అంటోంది. కానీ, బాలీవుడ్ మాత్రం... విద్య, సిద్ధార్థ్ అతి త్వరలోనే మనువాడబోతున్నారని అంటున్నారు.
'డర్టీ పిక్చర్'లో దక్షిణాది శృంగారతార సిల్క్ స్మిత పాత్రను పోషించిన విద్యాబాలన్ ఇప్పుడు 'కహానీ' సినిమాలో గర్భవతిగా నటిస్తోంది. ఈ యేడాది విడుదలయ్యే ఆమె తొలి చిత్రం 'కహానీ'యే. ఈ సినిమాతోనూ నటిగా మంచి మార్కులు పోగేసుకుంటానని విద్య ఆశిస్తోంది.
