1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. god

నేను తప్పులు చేయలేదు... కానీ దేవుడే దిక్కు: హన్సిక

హన్సిక
మనిషికి ఏదైనా అనుకున్నది కాలేదంటే.. దేవుడే దిక్కు అంటాం. అలా తనకూ అనిపిస్తుందని నటి హన్సిక కూడా అంటోంది. లేటెస్ట్‌గా మంచు విష్ణుతో కలిసి 'దొరకడు' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ ముగింపుకు చేరుకుంది. 

"నిజంగానే నాకు భక్తిభావం ఎక్కువ. ఏ సినిమాలో నటించాలన్నా.. పాత్ర చేయాలన్నా...అంతా దేవుడి దయ అనుకుంటాను. చిన్నప్పటి నుంచి దేవుడ్ని పూజిస్తాను. మనం చేసిన తప్పుల్ని సరిదిద్దమని దేవుడ్ని వేడుకుంటాం. నేను మాత్రం ఏం తప్పులు చేయలేదు.

అంతా మంచే చేయాలనుకుంటాను. సాధ్యమైనంతవరకు చేస్తాను. అందరూ బాగుండాలని కోరుకుంటాన"ని చెబుతోంది. ఈ సినిమాలో కూడా తనకు తగిన పాత్రనే పోషించానని చెప్పింది.