Hansika, jr Khushboo, Tollywood | "జూనియర్ ఖుష్బూ" హన్సిక 7 సినిమాలతో బిజీబిజీ!
ముద్దుగుమ్మ హన్సిక ఏకంగా ఏడు సినిమాలతో బిజీగా ఉంది. వాటిలో రెండు తెలుగు సినిమాలు కాగా, ఐదు తమిళ్ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో మంచు విష్ణుతో కలిసి నటిస్తోంది. లేటెస్ట్‌గా బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న చిత్రంలో నటించనుంది. ఇంకా హీరో ఫైనలైజ్ కాలేదు. తమిలంలో శింబు, సూర్య చిత్రాల్లో బుక్ అయింది. ఇంకా మూడు సినిమాలు పైప్‌లైన్‌లో ఉన్నాయి.
తమిళంలో నటించిన 'ఓకే ఒకే' సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. దీంతో ఆమెకు ఆఫర్లే ఆఫర్లే. అక్కడ జూనియర్ ఖుష్బూగా ఆమెను పిలుస్తున్నారట. ఆమె మాట్లాడుతూ- నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కెరీర్ చాలా హ్యాపీగా సాగుతోంది. సౌత్ చిత్రాల్లో బిజీగా ఉన్నాను. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలకి థ్యాంక్స్ చెబుతున్నానని అంది.
