1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Tamanna

Ram Charan | Tamanna | Zanjir | Racha | ''జంజీర్'' హీరోయిన్‌గా తమన్న కోసం చెర్రీ సిఫార్సు!

జంజీర్
File
FILE
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తెల్లపిల్ల తమన్నాల మధ్య లవ్ అఫైర్ నడుస్తోంది. చెర్రీ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం 'జంజీర్‌'లో హీరోయిన్‌గా తమన్నను ఎంపిక చేయాల్సిందిగా రామ్ చరణ్ పట్టుబట్టాడా.? అవుననే సమాధానమే బాలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది.

'జంజీర్' చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేయాలని చెర్రీ కోరగా చిత్ర డైరక్టర్ అపూర్వ లఖియా సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. హీరోయిన్ పాత్రకు తమన్నూ సూట్ కాదనే సమాధానం చెప్పాడట.

టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఉన్న తమన్నాను తనతో పాటు.. బాలీవుడ్‌కు పరిచయం చేయించాలన్న తలంపుతోనే చెర్రీ ఈ తరహా ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోది. ఇందుకో కారణంగా వారిద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ నడుస్తుండటం వల్లే చెర్రీ అంతగా శ్రద్ధ తీసుకున్నట్టు చిత్రపరిశ్రమ వర్గాల సమాచారం.

గతంలో కూడా తమన్నాకు మహేష్ బాబు, సిద్ధార్థ్, ధనుష్, బాలయ్య వంటి హీరోలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ఊహాగానాలు వచ్చాయి.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి