1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. no Affair With Karthi

Tamanna | no Affair With Karthi | Tamil | Tollywood | వివాహితుడితో ''ఏ'' సంబంధానికి ఇష్టపడను : తమన్నా!

తమన్నా
File
FILE
ఎట్టిపరిస్థితుల్లోనూ వివాహమైన ఒక సెలిబ్రిటీతో వివాహేతర సంబంధం పెట్టుకోబోనని టాలీవుడ్ తెల్లపిల్ల తమన్నా స్పష్టం చేసింది. అలాగే, తనకు తమిళ హీరో కార్తీతో అఫైర్స్ ఉన్నట్టు వస్తున్న వార్తలను ఆమె కొట్టివేశారు. ఇదే అంశంపై ఒక తమిళ టీవీ ఛానెల్‌తో ఆమె మాట్లాడుతూ.. తనకు వివాహితుడైన కార్తీకి లింకు ఉన్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు తీవ్ర నిరాశకులోను చేసినట్టు చెప్పారు.

ఈ తరహా వ్యాఖ్యలు ముఖ్యంగా కార్తీ భార్యకు, వారి కుటుంబానికి చెడ్డపేరు తెచ్చిపెడుతాయన్నారు. అంతేకాకుండా, ఎట్టిపరిస్థితుల్లోనూ ఒక వివాహితుడితే రొమాన్స్ సాగించబోనని తమన్నా స్పష్టం చేశారు. అంతేకాకుండా... తాను చాలా మంది హీరోలతో చాలా సన్నిహితంగా మెలుగుతానని, అలాగే కార్తీతోనూ కలిసిమెలిసి ఉన్నట్టు చెప్పారు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి