Sunny Leone | Bollywood | Jism-2 | డబ్బు సంపాదనకు పోర్న్ ఇండస్ట్రీకి మించిందిలేదు : సన్నీ
డబ్బు సంపాదనకు పోర్న్ ఇండస్ట్రీ చాలా మంచిదని ఇండో-కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ అభిప్రాయపడింది. వాస్తవానికి ఈ ఇండస్ట్రీలోకి వెళ్లేందుకు తనకు ఏమాత్రం ఇష్టం లేదని కానీ, డబ్బు సంపాదించేందుకు మరో మార్గం లేక ఈ పరిశ్రమలోకి అడుగుపెట్టినట్టు చెప్పారు.
తన బాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశంపై స్పందిస్తూ.. తనలో కూడా భారతీయ రక్తమే ప్రసరిస్తోందన్నారు. 'బిగ్ బాస్-5'లో తన నటనకు గుర్తింపుగా జిస్మ్-2లో ఛాన్స్ దక్కిందన్నారు. ఈ చిత్రంలో తన నటనకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయన్నారు.
ఇకపోతే.. తన పోర్న్ కెరీర్‌పై స్పందిస్తూ.. నిజానికి ఈ పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు తన తల్లిదండ్రులు అంగీకరించలేదన్నారు. అయితే, అనివార్య పరిస్థితుల్లో డబ్బు కోసం ఇందులోకి అడుగుపెట్టాల్సి వచ్చిందన్నారు. పోర్న్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తన తల్లిదండ్రులు సూచించారని, ఆ విధంగానే తాను నడుచుకుంటున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు.
