ప్రధాన పేజివినోదం » వెండితెర » గుసగుసలు » అబ్బో... పాలపిల్ల తమన్నా టాలీవుడ్ పైకి ఎక్కేస్తోంది.... (Tamannah, Milk Beauty, Love, Tollywood)
అబ్బో... పాలపిల్ల తమన్నా టాలీవుడ్ పైకి ఎక్కేస్తోంది....
శుక్రవారం, 4 మే 2012( 11:00 IST )
File
FILE
సినిమా భామలు ఏ ఊరు వెళితే ఆ ఊరి వాళ్లమని చెబుతుంటారు. అందులో తమన్నా కూడా తక్కువేం తినలేదు. తనకు గుర్తింపు తెచ్చిన తెలుగు సినిమాను ఎక్కేస్తుంది. నేను ఇక్కడి అమ్మాయినే.. చక్కగా తెలుగు మాట్లాడేస్తున్నాను. కొంతమందిలా ఇంకా నేర్చుకుంటానని మాత్రం అనను. దక్షిణాది తారగా నాకు మంచి పేరు ఉంది అని చెబుతోంది.
ఇటీవలే ప్రేమలో పడితే ఆడియోకు వచ్చింది. గతంలో ఇంగ్లీషు బాగా మాట్లాడేదాన్ని.. ఇప్పుడు భాష నేర్చుకోవడంతో తెలుగు, ఇంగ్లీషు కలిపి మాట్లాడేస్తున్నానంటోంది. ఇదే ఫంక్షన్‌లో చిత్ర సమర్పకుడు లింగుస్వామి... చిత్ర టైటిల్ గురించి ప్రేమలో పడితే.. ఎలా ఉంటుందని.. యాంకర్ అడగగా... ఇప్పుటివరకు పడలేదు. తమన్నాను కూడా మిల్కీ అందం ఇన్‌స్పైర్ చేసింది. ప్రేమలో పడాలినిపిస్తోందని చలోక్తి విసిరారు.
ఇదే విషయమై...తమన్నా స్పందిస్తూ- ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది సినిమాలో బాగా చూపిస్తాం. రియల్ లైఫ్‌లో ఇంకా ప్రేమలో పడలేదు. పడితే ఆ అనుభూతి చూశాక చెబుతానంటోంది. ఇక పడిన తర్వాత ఏం చెబుతుందీ...