Shriya | Tollywood | new Film | పాయింట్ కుదిరితే లొంగక తప్పదు: శ్రియ
నటి శ్రియ తాజాగా కొత్త విషయాన్ని చెబుతోంది. సినిమా ఇండస్ట్రీలో లొంగిపోక తప్పదని తేల్చి చెబుతోంది. తన అనుభవాలరీత్యా రెండే రెండు విషయాల్లో లొంగాల్సిందే. అవేమంటే.. సినిమాకు కథానాయకుడు తర్వాత దర్శకుడికే ప్రాముఖ్యం. లెక్కప్రకారం ఇంపార్టెన్స్ దర్శకుడికే ముందు రావాలి. కానీ హీరోయిజం ఉన్న ఇండస్ట్రీలో అతనికే వస్తుంది. దర్శకుడు చెప్పింది చేసేవాడు నటుడు.
సరే.. ఇవన్నీ ఎందుకులెండి.. శేఖర్ కమ్ముల చిత్రంలో నటిస్తున్నాను. ఆ చిత్రంలో నటీనటులంతా కొత్తవారే. కానీ నేను నటిస్తున్నా. కేవలం దర్శకుడిపై ఉన్న ప్రాముఖ్యత మేరకే. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అనే టైటిల్‌తో ఆయన యూత్‌ను, ఫ్యామిలీని ఆకట్టుకునే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నేను మంచి పాత్ర పోషిస్తున్నాను అంది.
ఇటువంటి చిత్రంలో నటిండచడం పట్ల ఫీల్ కాలేదా? అని అడిగితే... పది చిన్న చిత్రాలు తీసుకరాలేని పేరు ఒకే ఒక్క చిత్రంతో రావచ్చు. అలాంటప్పుడు కథ? పాత్ర? అంటూ ప్రాముఖ్యత చూడటం వేస్టు. డైరెక్టర్‌లో స్టఫ్ ఉందంటే మరో ఆలోచన లేకుండా చేయడానికి లొంగిపోవాల్సిందే అని స్పష్టం చేస్తుంది. ఆమె చెప్పింది కరెక్టే కదా!
