1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Gabbar Singh

Jeevitha | Gabbar Singh | Pavan Kalyan | Antyakshari | మా ఆయనను పవన్ అనుకరించినందుకే గబ్బర్ సింగ్ హిట్...జీవిత

జీవిత
WD
మెగా ఫ్యామిలీ అంటేనే కస్సుబుస్సులాడుతుంది జీవితా-రాజశేఖర్ ఫ్యామిలీ. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్‌పై జీవిత మెత్తగా ఝలక్ ఇచ్చారు. గత కొన్నేళ్లుగా హిట్లు లేని పవన్ కళ్యాణ్ మా ఆయన రాజశేఖర్‌ను అనుకరించి హిట్ కొట్టారని తేల్చేశారు.

అదెలాగయా అంటే... గబ్బర్ సింగ్‌లో అంత్యాక్షరి ఉన్నది. అందులో రోజ్ రోజ్ రోజాపువ్వా పాటను విలన్లు పాడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏమి సేతిత్తిరీ.. ఏమి సేతిత్తిరి.. అంటూ రాజశేఖర్ స్టయిల్‌లో మాట్లాడతాడు. ఈ అనుకరణ వచ్చినప్పుడు ప్రేక్షకులు విరగబడి నవ్వడం కనిపిస్తుంది.

ఈ విషయాన్ని గమనించిన రాజశేఖర్ భార్య జీవిత, పవన్ కళ్యాణ్‌పై పైవిధంగా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తన భర్త రాజశేఖర్‌ను అనుకరించడం వల్లనే హిట్ కొట్టారని, ఇలాంటి మిమిక్ చేస్తూ శివారెడ్డి డబ్బులు సంపాదిస్తుంటాడనీ, ఇపుడు పవన్ కూడా అదే దారిలో హిట్ కొట్టారని పరోక్షంగా చురక అంటించారు జీవిత.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT