1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Gifts

Producer | Gifts | Tollywood | Actress | dance | Party | హీరోయిన్లను చూస్తే ఆ నిర్మాత "మిరపకాయ్" అవుతాడట

నిర్మాత
WD
సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పేదేముంది. ఎవరు సినిమా తీసినా ఎంజాయ్‌ చేయడానికే అనుకునేవారు కొందరున్నారు. అలాంటి వారిలో ఇటీవల బాలయ్యతో సినిమా తీసిన నిర్మాత కూడా చేరిపోయారట. ఆయన విషయం పక్కనపెడితే... చాలామంది నిర్మాతల్లో అమ్మాయిల పిచ్చి ఉందట. సినిమాల్లో అవకాశాలు, డబ్బులు ఎరగా వేసే అమ్మాయిలను సినిమా ఛాన్సుల రూపంలో పట్టేస్తుంటారట.

ఆమధ్య రవితేజతో సినిమా తీసిన నిర్మాత టాలీవుడ్‌లో షోకిల్లారాయుడుగా పేరు తెచ్చుకుంటున్నారట. ఆయన ఏ పార్టీ చేసినా తాజ్‌ డక్కన్‌లో చేస్తుంటాడట. పుట్టినరోజు పార్టీ అనీ, మరో పార్టీ అని తెగ ఇచ్చేస్తుంటాడట. లక్షల్లో ఖర్చు చేయడమే కాకుండా ఆయన ఇచ్చే పార్టీల్లో అందుబాటులో ఉన్న హీరోయిన్లతో ఫుల్‌గా తాగించి ఎంజాయ్‌ చేస్తారని టాలీవుడ్ సినీజనం ఒకటే గోల చేస్తున్నారు.

ఇటీవలే జరిగి ఓ ఫంక్షన్‌లో విదేశీ వనితలు డాన్స్‌ చేశారట. అది కాస్తా బూతుబాగోతంగా ఉందని తెలిసింది. వారందరికీ తెగ ఖర్చుచేసే ఆయన హీరోయిన్లకు కాస్ట్‌లీ గిఫ్ట్‌లు ఇస్తుంటాడట. అందులో ఖరీదైన సెల్‌ఫోన్లు కూడా ఉంటాయనీ, తన దగ్గరకు వచ్చిన హీరోయిన్లను ఇతర నిర్మాతలకు రికమండేషన్‌ చేస్తుంటాడని చెపుతున్నారు. ఇవి మరింత శృతిమించితే ఇండస్ట్రీకి మరింత చెడ్డపేరు వస్తుందని సినీ జీవులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి