బెల్లంకొండ రూ. 3 కోట్ల గెస్ట్ హౌస్... సమంత ముచ్చటపడితే ఇచ్చేశారంట...
WD
అసలు ఇటీవలి కాలంలో తమిళ, మలయాళ హీరోయిన్స్ తెలుగుతెరను ఏలేస్తున్నారంటే నమ్మండి. తెలుగులో ఉన్న దౌర్భాగ్యం ఇదేనని ఇక్కడి పెద్ద దర్శకులు అవకాశం దొరికినప్పుడల్లా ఎత్తేస్తూనే ఉంటారనుకోండి. చిత్రం ఏమంటే... ఆ పరభాషా హీరోయిన్ల కాల్షీట్ల కోసమే నిర్మాతలు పడిగాపులు కాయడాలు, పారితోషికాలు పెంచడాలు చేసేస్తున్నారన్నది వాదన.
ఆమధ్య బెల్లంకొండ సురేష్, నటి సమంతపై ప్రశంసలు జల్లు కురిపించారన్నది తెలిసిందే. ఆయన సమంత గురించి చెపుతూ... సీన్ చెప్పగానే ఇట్టే అల్లుకుపోతుంది. ఈగ సినిమాలో ఆమె నటన అద్భుతం. అందుకే నా బేనర్‌లో వచ్చే మూడు చిత్రాల్లో ఆమెనే హీరోయిన్‌గా చేసేశాను అన్నారు.
తాజాగా వారి అబ్బాయి గోపీ హీరోగా చిత్రాన్ని చేస్తున్నారు. ఇందుకోసం సమంతకు ప్రత్యేకంగా గెస్ట్‌హౌస్‌ను ఏర్పాటు చేసి ఆమెకు బస ఏర్పాట్లు కల్పించారట. మూడు కోట్ల విలువ చేసే ఆ గెస్ట్‌హౌస్‌ను చూసి సమంత తెగ ముచ్చటపడటంతో అది కాస్తా ఆమెకే ఇచ్చినట్లు సినీజనం చెప్పుకుంటున్నారు.
పెద్ద నిర్మాత అయిన బెల్లంకొండ వంటి నిర్మాతలు ఇలా హీరోయిన్ల రెమ్యునరేషన్ పెంచుకుంటూపోతే వేరే నిర్మాతలు ఇలాంటి హీరోయిన్లతో సినిమా తీసే ఛాన్సే దొరకడంలేదంట. ఇలా రెమ్యునరేషన్ బదులు డాబాలు, స్థలాలు ఇవ్వడం మామూలే అయినా.. అది కేవలం హీరోలకు, దర్శకులకు ఇదివరకు ఉండేది. ఇప్పుడు హీరోయిన్‌లకూ ఇదే సూత్రం వర్తించడంతో నిర్మాతలు వ్యాపారంలో తారాస్థాయికి వెళ్ళిపోయారని అంటున్నారు.
