గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » ఆస్కార్ వేడుకల్లో "స్లమ్‌డాగ్" చిన్నారులు
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
FILE
సూపర్ హిట్ మూవీ "స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రానికి అవార్డులు వెల్లువల్లా వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కాయి.

తాజాగా మిలియనీర్ చిత్రంలో నటించిన చిన్నారి పాత్ర ధారులు జమాత్, తన్విలకు ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి ఆహ్వానం లభించింది. లాస్ ఏంజెలెస్‌లోని కొడాక్ థియేటర్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి జమాత్, తన్విలు హాజరు కావాల్సిందిగా ఆస్కార్ ఆహ్వానించింది.

స్లమ్‌డాగ్‌లో ముంబై మురికివాడ చిన్నారులుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నవీరు... త్వరలో లాజ్ ఏంజెలెస్‌కు బయలుదేరనున్నారు. మురికివాడల జీవన విధానాన్ని కళ్లకు కట్టిన ఈ స్లమ్‌డాగ్ చిన్నారులు... ఆస్కార్ వేడుకల్లోనూ ఓ వెలుగు వెలగనున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర హాలీవుడ్ స్లమ్డాగ్ మిలియనీర్ ఆస్కార్ వేడుకలు స్లమ్ డాగ్ చిన్నారులు ఆస్కార్ అవార్డు లాస్ ఏంజెలిస్ తన్వి జమాత్