1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. హాలివుడ్

చార్లి చాప్లిన్ కుమారుడు సిడ్నీ మృతి

వినోదం వెండితెర హాలీవుడ్ చార్లి చాప్లిన్ కుమారుడు సిడ్నీ చాప్లిన్ గుండెపోటు మరణం ఫన్నీగర్ల్ బెల్స్ ఆర్ రింగింగ్
ప్రముఖ హాస్యనటుడు చార్లి చాప్లిన్ కుమారుడు సిడ్నీ చాప్లిన్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు మరణించేనాటికి 82 సంవత్సరాలు. చార్లీ చాప్లిన్ రెండో కుమారుడైన ఆయన రంగస్థల నటుడిగా ప్రసిద్ధి చెందడంతో పాటు, 1950లో "బెల్స్ ఆర్ రింగింగ్" సంగీత రూపకంలో నటించినందుకుగానూ టోనీ అవార్డును దక్కించుకున్నాడు.

సిడ్నీ నటించిన మరో సంగీత రూపకం "ఫన్నీగర్ల్" కూడా ప్రజాదరణ పొందింది. తండ్రిబాటలోనే పయనించిన సిడ్నీ, లాస్ ఏంజెల్స్‌లో సర్కిల్ థియేటర్‌ను ఆవిష్కరించారు.

ఇకపోతే.. చార్లీ చాప్లిన్ దర్శకత్వం వహించిన చివరి సినిమా ఎ కౌంటెస్ ఫ్రమ్ హాంగ్‌కాంగ్‌లో కూడా సిడ్నీ నటించడం గమనార్హం.
About Writer
SELVI.M