చివరి పార్టీ ఏర్పాటు చేయరూ..!
|
ప్రస్తుతం జేడ్ గూడీ ఆరోగ్యం క్షీణించిందని, మృత్యువాత పడేందుకు రోజులు లెక్కపెట్టుకుంటోందని వైద్యులు వెల్లడించారు. మరణ శయ్యపై ఉన్న గూడీ, ఈ లోకం వదిలి వెళ్లే చివరి గంటల్లో అందరిని చూస్తూ కన్నుమూయాలని భావిస్తున్నట్లు సన్ పత్రిక తెలిపింది.
జేడ్ గూడీ కోరిన విధంగానే చివరి పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని గూడీ తల్లి తెలిపినట్లు సన్ పత్రిక తన ప్రచురణలో వెల్లడించింది. గూడీ చివరి కోరికను నెరవేర్చే దిశగా వైద్యులు కూడా ఈ పార్టీ ఏర్పాటుకు అంగీకరించారని, దీంతో గూడీ చివరి రోజులను తన పిల్లలు బాబి (5), ఫ్రెడ్డి (4)లతో గడుపనుందని సన్ పేర్కొంది.

