HollyWood| Refugees| Angelina Jolie| Washington| Tears | శరణార్థుల కోసం కంటతడి పెట్టిన జోలీ!
హాలీవుడ్ నటి ఏజెంలీనా జోలీ అంతర్జాతీయ శరణార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తలచుకొని కంటతడి పెట్టారు. ప్రపంచ శరణార్థ దినాన్ని పురస్కరించుకొని అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏంజెలీనా పాల్గొన్నారు.
ప్రపంచంలో శరణార్థుల కోసం అమెరికా రాజకీయ నాయకులు మరింత చేయూతనివ్వాలని కన్నీటి పర్యంతమవుతూ ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థకు గుడ్‌విల్ అంబాసీడర్‌గా వ్యవహరిస్తున్న ఏంజెలీనా మాట్లాడుతూ.. శరణార్థులను సంఖ్యల్లో చూడటం సబబు కాదన్నారు.
వారిలో తల్లులు, కుమార్తెలు, తండ్రులు, కుమారులు ఉన్నారని చెప్పారు. ప్రయాణాల్లో తాను కలుసుకున్న శరణార్థులు తన జీవితాన్నే మార్చివేశారని తెలిపారు.
వారి జీవితాల గురించి తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకు శరణార్థులకు ధన్యవాదాలు తెలిపారు. యుద్ధాల కారణంగా శరణార్థులుగా మారిన పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన పెంచేందుకు అమెరికా రాజధానిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఏంజెలీనా జోలీ విలేకరులు, రాజకీయ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.