1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. హాలివుడ్
  6. Avatar

James Camaron | Avatar | August | మరిన్ని కొత్త సన్నివేశాలతో ఆగస్టు 27న అవతార్

జేమ్స్ కేమరూన్
WD
జేమ్స్ కేమరూన్ రూపొందించిన అవతార్ అద్భుత విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలను జత చేస్తూ ఈ అవతార్ చిత్రాన్ని ఈ నెల 27న మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ స్పెషల్ ఎడిషన్ డి.వి.డి కూడా విడుదల కానుంది.

అవతార్ చిత్రంలో పండోర ద్వీపాన్ని అద్భుతంగా తన ఊహాశక్తితో తెరపై ఆవిష్కరించిన జేమ్స్ కేమరూన్, ఈ చిత్రానికి సీక్వెల్‌ను కూడా రూపొందించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సీక్వెల్‌లో పండోర ద్వీపంలోని సముద్ర జలాల అందాలను కూడా అద్భంతంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు.

స్పెషన్ సన్నివేశాలను జత చేసుకున్న అవతార్‌కు మరింత క్రేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. గత డిసెంబరు మాసంలో జనం ముందుకు వచ్చిన అవతార్ ఈనాటికీ కొన్ని థియేటర్లలో ప్రదర్శితమవుతూనే ఉంది.

అవతార్ సినిమా చూసి పండోర ద్వీపంపైన, అక్కడి మనుషులపైన అభిమానం పెంచుకున్న ప్రేక్షకులు ఈ కొత్త సొబగుల అవతార్ చూసి మరింత ఆనందిస్తారని జేమ్స్ కేమరూన్ అన్నారు.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి