1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

కథ కోసం ఇమేజ్ పక్కనపెట్టి తీరాలి: శ్రీహరి

వెండితెర నిండు రూపం శ్రీహరి గంభీరంగా కనిపించడం తాజా చిత్రం శ్రీ మహాలక్ష్మీ కథ ఇమేజ్
వెడితెరకు నిండు రూపం శ్రీహరి. గంభీరంగా కనిపించే కనుముక్కుతో.. సినీ పరిశ్రమలో చాలా మంది చేత అన్నయ్యా అని పిలిపించుకునే వ్యక్తి. తెరమీద హీరోగానే కాదు.. చెల్లెళ్లకి అన్నగా కూడా బాధ్యతాయుతంగా కనిపిస్తాడు. శ్రీహరి తెలుగు వెండి తెరకు వచ్చే నెల 4న ‘శ్రీ మహాలక్ష్మి’ని విడుదలైన సందర్భంగా ఆయనతో మాటా మంతీ..

ప్ర * శ్రీ మహాలక్ష్మి గురించి చెప్పండి?
జ * చాలా బాగుంది. ఇంతకుముందే మలయాళంలో ప్రూవ్ చేసుకున్న సబ్జెక్ట్ కాబట్టి ఇంకా బాగా చేశాం.

ప్ర * తెలుగు నేటివిటీక్ తగ్గట్టు మార్పులేమైనా చేశారా?
జ * తప్పకుండా చేశాం. చాలా మార్పులు కావాల్సి వచ్చాయి. టాప్ మోస్ట్ టెక్నీషియన్స్‌తో చేశాం. దర్శకుడు చాలా మంచివాడు. ప్రతిభాశాలి. ఇవాళ్టి హిట్ సినిమాలన్నింటిలో అతనికి భాగం ఉంది.

ప్ర * స్థానికంగా జరుగుతున్న ర్యాగింగ్ లాంటి వాటిని కూడా మీరు కథలో చొప్పించారా?
జ * కొన్ని విషయాలు యూనివర్సల్‌గా జరుగుతుంటాయి. మొన్న కూడా అక్కడెక్కడో... ఒక వ్యక్తి అమ్మాయిని షూట్ చేశాడు. ఇవి ఎక్కడైనా ఒక్కటే. ఇక మా సినిమాలో ఇలాంటి సన్నివేశాలంటారా.. గమ్మత్తుగా ఉంటాయి. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా అరుదుగానే బయట కనిపిస్తాయి.

ప్ర * అసలు ఏమిటి కథాకమామీషు?
జ * శ్రీ మహాలక్ష్మి అనే అమ్మాయికి జరిగిన అన్యాయం.. ఓ లాయర్‌గా నేను ఎలా ఆదుకున్నను.. దీని చుట్టూ తిరిగే అంశమే ఈ చిత్రం కథ.

ప్ర * తొలిసారి మీ సినిమాకి శ్రీ మహాలక్ష్మి అని లేడి క్యారక్టర్ పేరు పెట్టారే?
జ * సాంబయ్య గానీ.. హనుమంతు గానీ కథ డిమాండ్ చేసిన పేర్లే.. ఇమేజ్‌లను పక్కన పెట్టి చేసేదే సినిమా. ఈ కథకి ఆ అమ్మాయి పేరయితే సరిపోతుందని పెట్టాం.

ప్ర * హీరోయిన్‌గా కేరళ అమ్మాయిని పెట్టినట్టున్నారు?
జ * మలయాళంలో నటించిన అమ్మాయి కోసమే ప్రయత్నించాం.. కానీ కుదరలేదు. అంత బిజీగా కనిపించింది. అందుకే ఆ పాత్రకు సరిపోయే మరో అమ్మాయిని కేరళ నుంచి తీసుకొచ్చాం.. ఈ చిత్రం తర్వాత ఈ అమ్మాయి కూడా అంతే బిజీ కావడం ఖాయం. ఇక తిలకన్‌ను కూడా అక్కడి నుంచే తీసుకొచ్చాం.

ప్ర * ఓ వైపు క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరొచ్చినా ఇకపై వాటిని చేయనంటున్నారు?
జ * గొప్ప కథ అనిపిస్తేనే క్యారక్టర్లు చేస్తాను. నేను పరిశ్రమకు క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుదామని రాలేదు. హీరో కావాలని కలలు కన్నా. అలాగే చేస్తున్నా. అంటే విలన్ పాత్రలు చేయవా అంటే చేస్తాను. నేను ఇన్‌స్పైర్ అయి చేయాలి. కథో.. దర్శకుడో.. సంస్థో, నిర్మాతో... పాత్రో.. ఏదో ఒకటి నచ్చాలి. అలాంటప్పుడు తప్పకుండా చేస్తాను.

ప్ర * ఢీ మీకు మంచి పేరు తెచ్చిపెట్టింది కదా?
జ * నేను కథ విన్నప్పుడే చెప్పాను శ్రీను వైట్లతో. అనుకున్న లైన్‌ని.. అనుకున్నట్టు తీస్తే సక్సెస్ అవుతావని. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ విషయం. చాలా ప్యూరిటీ ఉంది. అది దెబ్బతినకూడదు. ఇక అందులో వినిపించే తెలంగాణా యాసను కూడా నేనే మార్చుకున్నా. శ్రీను వచ్చి డైలాగులు అడిగిన ప్రతిసారీ ఇద్దరం కూర్చుని ఆలోచించి చేశాం.

ప్ర * మీ తదుపరి చిత్రాలేమిటి?
జ * నిర్మాత లార్స్‌కో శ్రీధర్ చిత్రం ‘వియ్యాల వారి కయ్యాలు’ చేస్తున్నాను. అందులో నా పాత్ర పేరు భూపతి రాయుడు. అదో డైమన్షన్. ఆకట్టుకునే కోణంలో ఉంటుంది.
About Writer
WD