ఎక్స్‌పోజింగ్ క్యారెక్టర్లపై ఆధారపడను: ఇలియానా
అప్పుడే ఫ్రిజ్‌లోంచి తీసిన యాపిల్ పండులా ఫ్రెష్‌గా ఉంటుంది ఇలియానా. అందుకే ఆమె అంటే కుర్రకారుకి క్రేజ్. ఈ వీక్‌నెస్ తెలుసుకున్న 'దేవదాసు' చిత్రంలో దర్శకుడు వైవీఎస్.చౌదరి ఎంపికచేశారు. కథ పెద్దగా లేకపోయినా హీరో రామ్, ఇలియానా ఫ్రెష్‌నెస్‌ను యూత్ బాగా ఎంజాయ్ చేసి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఇలియానా 'రాఖీ', 'పోకిరి', 'మున్నా', 'ఆట' వంటి చిత్రాల్లో నటించింది.
తాజాగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'దుబాయ్ శ్రీను' చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. మరో పక్క మహేష్ బాబు తాజా చిత్రం (కొత్త చిత్రం)లో నటించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం సినిమారంగాన్ని ఏలుతున్న నాయికల్లో ఇలియానా అగ్రభాగాన ఉన్నారు. ఇటీవలే 'దుబాయ్ శ్రీను' కోసం ఓ పాటను హైదరాబాద్‌లో చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో ఇలియానాతో కాసేపు..
ప్రశ్న : 'దేవదాసు' చిత్రంలో నటించేటప్పుడు మీ కెరీర్ ఈ స్థాయికి ఎదుగుతుందని ఊహించారా?
ఇలియానా : అస్సలు ఊహించలేదు. 'దేవదాసు'లో కమిట్ అయినప్పుడు ఈ సినిమాలో బాగా నటిస్తే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు అనే ఆలోచన మాత్రమే ఉండేది. అంతకుముంచి ఎలాంటి ఊహలు లేవు.
ప్ర : మీ మొదటి చిత్రం మొదలుకుని తాజా చిత్రం 'ఆట' వరకు ఎక్స్‌పోజింగ్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దర్శకులు కూడా మిమ్మల్ని అలానే ఉపయోగించుకుంటున్నారనే విషయం చూసిన వారికి అనిపిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం?
ఇ : ఈ మాటను నేను అంగీకరించను. దర్శకులందరూ అలా చేయడం లేదు. అయనా నేను ఎక్స్‌పోజింగ్ క్యారెక్టర్ల మీదే ఆధారపడాలనుకోవడం లేదు. అవి పబ్లిసిటీకి మాత్రం దోహదపడుతాయే గానీ, కెరీర్ లాంగ్విటీకి ఏ మాత్రం ఉపయోగపడవు. నేను ఇంగా చాలా సంవత్సరాలు పరిశ్రమలో ఉండాలని భావిస్తున్నాను. కాబట్టి నటనకు అవకాశం ఉన్న పాత్రలను మాత్రమే చేయాలని భావిస్తున్నాను. 'పోకిరి'లో నటనకు అవకాశం ఉన్న పాత్రే చేశాను. ఇందులో ఎక్స్‌పోజింగ్ లేదు కదా?
ప్ర : 'రాఖీ'కి ముందు మీరు నటించిన 'పోకిరి' మీ కెరీర్‌కి ఎంతవరకు ఉపయోగపడింది.?
ఇ : నా మొదటి చిత్రం 'దేవదాసు' చిత్రం ఫోట సెషన్సు చూసినప్పుడు, వాటి పబ్లిసిటీతో చాలా మంది నిర్మాతలు నన్ను అడిగారు. ఫ్రాంక్‌గా చెప్పాలంటేఆ సినిమా నా కెరీర్‌కు హెల్ప్ అయిందో లేదో తెలియదు కానీ, 'పోకిరి' చిత్రంలో మాత్రం నేను బాగున్నానని, బాగా చేశానని అందరూ అంటున్నారు. ముఖ్యంగా మహేష్ బాబుతో నటించడం మంచి అనుభూతిని ఇచ్చింది. మంచి జోవియల్‌గా ఉంటాడు. నటనకు సంబంధించిన పలు అంశాలు తన నుంచి నేర్చుకున్నాను.
ప్ర : తమిళంలో 'కేడి' చిత్రం తర్వాత వచ్చిన అవకాశాలకు మీరు భారీ పారితోషకం డిమాండ్ చేశారనే మాటలు వినిపించాయి. అదెంతవరకు నిజం?
ఇ : 'కేడి' తర్వాత కొన్ని సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ, ఆసక్తి లేకపోవడంతో చేయలేదు. ముఖ్యంగా కథలు నచ్చలేదు. పారితోషకం వల్ల చేయలేదని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు.
ప్ర : ఏదైనా సినిమా చూసేటప్పుడు మీరెలాంటి అంశాలను పరిగణంలోకి తీసుకుంటారు?
ఇ : నేను చేయబోయే క్యారెక్టర్ బాగుందో లేదో ముందుగా చూసుకుంటాను. అంతవరకే.. క్యారెక్టర్ నచ్చితే సినిమాకు సైన్ చేస్తాను.
ప్ర : కానీ, గత కొంత కాలంగా కథానాయికలకు నటనకు అవకాశం ఉన్న పాత్రలు రావడం లేదు కదా?
ఇ : అది వాస్తవమే. ఆ విషయంలో నాకు ఒకింత బాధగానే ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్లందరికీ కూడా నటిగా తమని తాము నిరూపించుకోవాలని ఉంటుంది. కానీ, ఎక్కువగా గ్లామర్‌కి స్కోప్ ఉన్న పాత్రలే వస్తున్నాయి. అలా వచ్చిన పాత్రల్లో కూడా తమని తాము నిరూపించుకోవటానికి ప్రయత్నించడం జరుగుతోంది.
ప్ర : హీరోయిన్‌గా నిలబడాలంటే చాలా విషయాల్లో సర్దుబాటు చేసుకోవాలనే మాటలు వినొస్తుంటాయి? అందెంతవరకు నిజం? ఇ : నటన కూడా ఓ వృత్తిలాంటిదే. నేను యాక్టింగ్‌ని నా ప్రొఫెషన్‌గా ఎంపిక చేసుకున్నాను. ఇక్కడ నా వృత్తి.. ఒప్పుకున్న పాత్రకు న్యాయం చేయటం. అంతవరకే. అంతకుమించి ఎవరి కోసమూ ఏమీ చెయ్యక్కర్లేదు. ఎవరికీ అడ్జెస్ట్ కానక్కర్లేదు. నా వరకు సినీ పరిశ్రమ చాలా కంఫర్టబుల్‌గా ఉంది.
ప్ర : మీరు ఎంపిక చేసుకున్న ఈ ప్రొఫెషన్ ఒక నిర్ణీత సమయంలో ముడిపడినది కాదు. ఇలా టైమ్ లిమిటేషన్‌లేని ఈ వృత్తి పట్ల మీ ఫీలింగ్?
ఇ : ఎప్పుడూ జరగదు కదా. ఒక్కోసారి 24 గంటల్లో చాలా గంటలు పనిచేస్తున్నప్పుడు మాత్రం ఒత్తిడి అనిపిస్తుంది. కానీ, స్క్రీన్ మీద నన్ను నేను చూసుకున్నప్పుడు పడిన కష్టమంతా మరచిపోతాను. అంత హార్డ్‌వర్క్ చెయ్యటం వల్లే ఇంతమంచి అవుట్‌పుట్ వచ్చిందనిపిస్తోంది. కనుక.. హార్డ్‌వర్క్ చేయటానికి నేనెప్పుడూ వెనుకాడను.