1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

ఐదు అంశాలు ఆధారంగా కొత్త సినిమా అంగీకారం: ఆసిన్

అసిన్.. అటు తమిళం
అసిన్.. అటు తమిళం, ఇటు తెలుగ భాషల్లో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్. నిజమే మరి ఓ వైపు సినిమాలు... మరో వైపు యాడ్స్ తప్ప ఆమెకు ఇంకేమి తెలియవు పాపం. ఈ చక్కని చుక్క ‘అమ్మా నాన్న తమిళమ్మాయి’ చిత్రంతో తెలుగు వారికి పరిచయమైంది. ఇటీవల ఆమె నటించిన ‘అన్నవరం’ కూడా ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా కమల్ హాసన్ నటిస్తున్న‘దశావతారం’ షూటింగ్‌లో బిజీగా ఉన్న అసిన్‌తో ముఖాముఖి.

ప్ర .. హీరోలకే ప్రాధాన్యమున్న పరిశ్రమ ఇది. ఇక్కడ కథానాయిక పాత్రకు మీరు ఆశించేంత ప్రాముఖ్యం లభిస్తుందా?
జ .. ఇతరుల గురించి నాకు తెలియదు గానీ.. నేను సినిమాల్లో నటించే చిత్రాల్లో మాత్రం అలా కనిపించడంలేదు కదా. ప్రతి చిత్రంలోనూ నా పాత్రకు అంతో ఇంతో ప్రాముఖ్యం అయితే మాత్రం తప్పకుండా ఉంటుంది. ప్రస్తుతం ‘దశావతారం’లోనూ నాకు మంచి ప్రాముఖ్యమే ఉంది.

ప్ర .. సినిమాలు చేయడంలో మీకేమైనా నియమాలు పెట్టుకున్నారా?
జ .. నేను ఎప్పుడూ నియమాలకు కట్టుబడను. వచ్చే సినిమాలు... అందులో నా పాత్రల తీరుతెన్ను దృష్టిలో ఉంచుకుని నచ్చితే చేస్తాను.

ప్ర .. ‘దశావతారం’లో మీ పాత్ర తీరుతెన్నూ ఏమిటి?
జ ..‘వరలారు’ తరవాత కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రమిది. నా కెరీర్‌లో చెప్పుకోతగ్గ మంచి చిత్రమవుతుంది. నా పాత్ర గురించి బయట చెప్పకూడదని ఆంక్షలు పెట్టారు. సో సారీ. ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు.

ప్ర .. ఓ వైపు సినిమాల్లో బిజీ తారగా వెలుగుతూ ప్రకటనల్లో నటించడం వీలుకుదురుతుందా?
జ .. సినిమా ఇమేజ్‌తో ప్రకటనల్లో అవకాశం వస్తోంది. కొన్ని ప్రకటనలు పాపులర్ కావడం వల్ల మంచి సినిమాలు రావడానికీ దోహదపడుతున్నాయి. మరి కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌గా కూడా వ్యవహరిస్తున్నాను. ఇది తలచుకుంటే.. చాలా గర్వంగా ఉంటుంది.

ప్ర .. మీరు కొంతమంది హీరోలకే పరిమితం అంటారు. నిజమేనా?
జ .. ఒక సినిమాను ఒప్పుకోవడానికి ముందు అయిదు విషయాలు చూస్తాను. బ్యానర్, క్యారెక్టర్, దర్శకుడు, కథ, హీరో.. ఇందులో నా చివరి ప్రాధాన్యత హీరోకు. నేనింత వరకు చాలా సినిమాల్లో చేశాను. నాతో పని చేసిన వారికి నా గురించి బాగా తెలుసు. అయితే.. నాపై వచ్చే విమర్శలను పట్టించుకోను.

ప్ర .. వరుసగా పెద్ద హీరోల సరసనే నటిస్తున్నామని భావన మీలో కలుగుతుందా?
జ .. అలాంటిదేమీ లేదండీ. చాలా సంతోషంగా ఉంది. కానీ అదే సమయం నా సంతోషం గర్వం కాకూడదన్న భయం కూడా ఉంది. నిజానికి నేను సాధించిన విజయాలన్నీ రాత్రికి రాత్రి వచ్చినవి కావు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగానన్న విషయాన్ని మర్చిపోను. ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటాను... నా ప్రయాణం ఎలా సాగిందో సమీక్షించుకునేందుకు.

ప్ర .. మీలో ప్లస్ పాయింట్స్?
జ .. నాకు ఆత్మవిశ్వాసంతో పాటు ఉత్సాహం కూడా ఎక్కువే. ఎప్పుడూ అంకిత భావంతో పనిచేస్తాను. ఆసక్తితో కష్టపడటానికి వెనుకాడి తర్వాత వెనుకడుగు వేయను. అలాంటివి నాకు నచ్చవు కూడా. ఇవే నాకు ప్లస్‌లు.. నా బలాలు కూడా.

ప్ర .. త్రిష, శ్రియ.. వీళ్లలో మీకు పోటీ ఎవరు?
జ .. నేనెవరినీ పోటీగా తీసుకోలేదు. అలాంటి భావనే నాకు నచ్చదు. నాకు నేనే పోటీ. నేను ఎలాంటి సినిమాల్లో నటించాలో నేనే నిర్ణయించుకుంటా. పరిశ్రమలో తీసే ప్రతి సినిమాలోనూ నేనే నటించలేను కాబట్టి మిగిలిన వారూ రావాల్సిందే.. చేయాల్సిందే. నాకు మనస్సుకు నచ్చి, నా స్వభావానికి సరిపోయే వాటిలో నేను చేస్తా.

ప్ర .. మరి ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా?
జ .. ఏమండీ.. నా జీవితం సాఫీగా సాగిడం మీకు నచ్చలేదా (నవ్వుతూ).
About Writer
WD