గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ముఖాముఖి » మీరు ఎవరి కోసం మారొద్దు: రామ్ చరణ్
ముఖాముఖి
Feedback Print Bookmark and Share
 
WD PhotoWD
ప్రతి నటుడికి తమదైన శైలి ఉంటుంది. కొత్తగా సినిమారంగంలో కాలుపెట్టే వాళ్ళెవరైనా తమకు ఆదర్శం మెగాస్టార్ అనడం సహజం. డాన్స్‌లోనూ, యాక్షన్‌, ఫైట్స్‌లోనూ చిరుకు ప్రత్యేక శైలి. ఆయన బాటలో పయనించాలనే చాలామంది ఉవ్విళ్ళూరుతారు. వారసునిగా కావాల్సిన విద్యలన్నీ నేర్పించి, చిరంజీవి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

ప్రస్తుతం చరణ్ 'చిరుత' చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ షూటింగ్ ఇటీవలే బ్యాంకాక్‌లో ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చింది. బుధవారం రాత్రి ఓ కార్యక్రమంలో చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై తన మనస్సులోని మాటలను వెలిబుచ్చారు. ఆ విషయాలు 'వెబ్‌దునియా' తెలుగు వీక్షకుల కోసం...

ప్ర : మీ 'చిరుత' ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది?
జ : టాకీ పూర్తి దశలో ఉంది. దర్శకుడు చెప్పింది చెప్పినట్టు తెరకెక్కిస్తున్నారు. ఆయనతో నటించడం అదృష్టంగా భావిస్తున్నా.

ప్ర : 'చిరుత' ఎలా ఉంటాడు.?
జ : మీరూ, మీతోపాటు, మెగాస్టార్ అభిమానులు ఊహించుకున్నట్టుగానే ఉంటాడు

ప్ర : మా నాన్నాగారి ప్రాణం ఖరీదు సినిమా విడుదల రోజైన సెప్టెంబరు 22వ తేదీన విడుదల చేయాలనుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజమేనా?
జ : అన్నీ మీరే చెప్పేస్తున్నారు కదా? మీరు అనుకున్నట్టుగానే సెప్టెంబరులో విడుదలవుతుంది. తేదీ మాత్రం నాకు తెలియదు.