గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ముఖాముఖి » భానుమతిగారిలా నటిస్తూ.. పాడడం...
ముఖాముఖి
Feedback Print Bookmark and Share
 
WD PhotoWD
పరభాషా చిత్రాల నుంచి తారామణులను దిగుమతి చేసుకోవడం సహజం. ఇలా వచ్చిన వారిలో పెక్కుమంది నటన కంటే అందచందాల అప్పగింతలకే పరిమితమవుతున్నారు. కానీ మమతా మోహన్‌దాస్ మాత్రం తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ మలయాళం నుంచి తమిళం మీదుగా తెలుగు తెరపై తళుక్కుమంది.

'యమదొంగ'లో కథానాయికగా కనిపంచనుంది. ఆమె హీరోయిన్‌గా కనిపించక ముందే.. ఆమె పాడిన పాటలు శ్రోతలను, సినీ అభిమానులను ఉర్రూతలూగించాయి. 'రాఖీ' చిత్రం కోసం 'రాఖీ రాఖీ రాఖీ నువ్వే నా కవాసాకీ...' అంటూ ఉషారెక్కించింది. మెగాస్టార్ చిరంజీవి తాగాజా నటించిన 'శంకర్‌దాదా జిందాబాద్' చిత్రంలో 'ఆకలేస్తే అన్నం పెడతా..' అంటూ పాడిన పాట చిత్రానికే హైలెట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా మమతా మనస్సులో దాగివున్న మాటలను తెలుసుకుందాం.. రండి.

ప్ర: తెలుగులో గాయనిగా మీ ప్రవేశం ఎలా జరిగింది.?
నేనొక గాయనిగా పరిచయమవుతానని ఎప్పుడూ అనుకోలేదు. 'ఆట' చిత్రంలో కథానాయికగా నటించాల్సింది. కానీ అది జరగలేదు. ఈ చిత్రం ఫోటో సెషన్స్‌ జరుగుతున్నపుడు గ్యాప్‌లో సిద్ధార్థతో పిచ్చాపాటిగా మాట్లాడుతుండగా.. పాటలు, సంగీతం టాపిక్ వచ్చింది. ఆయన దేవీశ్రీప్రసాద్‌కు పరిచయం చేశారు. పాడమని ఆడిగారు. హిందీ, మలయాళం, తమిళం చిత్రాల్లో కొన్ని పాటల పల్లవులు పాడి వినిపించాను. ఆయనకి నా గాత్రం నచ్చి గాయనిగా అవకాశం ఇచ్చారు.

ప్ర: భాషకాని భాషలో పాడడం ఇబ్బందిగా లేదా.?
యాసలో ఎటువంటీ ఇబ్బంది లేదు కానీ.. సరైన ఉచ్ఛారణలో పాడడంలో కొంత ప్రాబ్లమ్ ఎదుర్కొంటున్నాను.