గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ముఖాముఖి » అది కోల్పోయానేమో అనిపిస్తుంది: షీలా
ముఖాముఖి
Feedback Print Bookmark and Share
 
ప్ర: బాలనటిగా పేరు తెచ్చిన చిత్రాలు ఏమైనా ఉన్నాయా?
నెపోలియన్, నగ్మా నటించిన 'గురుపౌర్ణమి' చిత్రంలో ద్విపాత్రాభినయం చేశాను. ఇందులో మంచి పేరు వచ్చింది. అలాగే.. 'డుం..డుం...డుం...' కూడా. ఇలా దాదాపు బాలనటిగానే తమిళంలో 25 చిత్రాల్లో నటించాను. తెలుగులో 'సీతాకొక చిలుక' తమిళంలో 'ఇలవట్టం'లో నటించాను. ప్రస్తుతం మరో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నాను.

ప్ర: నటిగా రెండు రంగాలను పోలిస్తే ఏమనిపిస్తుంది.?
సాంకేతిక పరంగా రెండిటింలోను ఒకే పోకడ. భాషే వైవిధ్యం. తమిళంలో సహజత్వంతో పాటు.. కొంత వైవిధ్యాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తారు. తెలుగులో గ్లామర్‌కే పెద్దపీట వేస్తారు. ఎలా ఉన్నా రెండు భాషలంటే ఇష్టం.

ప్ర: పోటీ యుగంలో మీరెలా నిలదొక్కుకుంటారు?
పోటీ ఉన్నా గమ్యం చేరాల్సిందేకదా. నా గమ్యం ఎటువైపు అనేది నేను వెతుక్కుంటూ పయనిస్తూనే ఉంటాను. మధ్యమధ్యలో స్పీడ్ బ్రేకర్‌లా గ్లామర్ రోల్స్ వచ్చినా చేస్తాను. కానీ మితిమీరిన శృంగారం జోలికి మాత్రం వెళ్ళను.

ప్ర: తెలుగు నేర్చుకుని చాలామందికి ఆదర్శం అయ్యారు. ఎలా సాధ్యపడింది?
'సీతాకొక చిలుక' షూటింగ్‌లోనే దర్శకుడు, హీరో చాలా ఎంకరేజ్ చేసి, భాష నేర్చించారు. భాష వస్తేనే భావం తెలుస్తుంది. అప్పుడే బయటకు వ్యక్తీకరించగలవని దర్శకుడు సలహా ఇచ్చారు. ఎక్కువ భాగం ఆ చిత్రంలోనే నేర్చుకున్నాను. ఆ తర్వాత రెండో సినిమా 'రాజుభయ్యా'లో నేర్చుకున్నది. టోటల్‌గా 80 శాతం నేర్చుకున్నా.

ప్ర: రెండు చిత్రాలు నిరాశపరియాయి కదా?
ప్రతి సినిమా విజయవంతం కావాలనే కోరుకుంటాం. కానీ టైమ్, లక్కు లేనప్పుడు ఏమీ చేయలేం. నేను ఆ రెంటినీ నమ్ముతాను.