ప్రధాన పేజి   వినోదం > వెండితెర > ముఖాముఖి
 
ఆయన నాకు దేవుడితో సమానం: దేవీశ్రీ ప్రసాద్
WD PhotoWD
17ఏళ్ళ ప్రాయంలో "దేవి" సినిమా ద్వారా దేవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు. ఆయనకూ చిరంజీవికి చాలా సంబంధం ఉంది. రచయిత సత్యమూర్తి కుమారుడే దేవీశ్రీ ప్రసాద్. చిన్నప్పటి నుంచి సంగీతజ్ఞానం ఎక్కువే. సత్యమూర్తి చిరంజీవి చిత్రాలకు కథలు అందించారు. సినిమాకు పనిచేశాడు. వాళ్ళన్నగారి దగ్గరకు వచ్చిన ఎం.ఎస్. రాజుకు ఓసారి దేవీ చేసిన కొన్ని ట్యూన్స్ వినిపించాడు. అప్పటికి 14ఏళ్ల పిల్లాడులో విషయంఉందని ఆనాడే గ్రహించిన ఎం.ఎస్. రాజు "దేవీ"కి అవకాశం కల్పించాడు.

ఆ తర్వాత చిరంజీవికి కూడా కొన్ని ట్యూన్స్ వినిపించడంతో అవి నచ్చి తప్పక అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. అలా వారి కలయిక కొనసాగింది. ఓ సందర్భంలో చిరంజీవి దేవీశ్రీకి గిఫ్ట్‌గా ఇంపోర్టెడ్ వాచ్ బహుకరించాడు కూడా. దేవీశ్రీ ప్రసాద్ డాన్సర్ కూడా. మొట్టమొదట "మిస్టర్ దేవీ" అనే ప్రైవేట్ ఆల్బమ్‌ చేశాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడు.

ప్రస్తుతం ఆయన వయసు 25. ఈ ఎనిమిదేళ్ల కెరీర్‌లో "ఆనందం", "ఆర్య", "వర్షం", "నువ్వొస్తానంటే నేనొద్దంటానా", "మాస్", "మన్మథుడు", "శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్", "బొమ్మరిల్లు"... వంటి చిత్రాలు ఈ యువకుడి ప్రతిభకు సాక్ష్యాలుగా నిలిచాయి. మసాలా రాగాలు దట్టించడంలో సిద్ధహస్తుడయ్యాడు. క్యాచీ స్వరాలు అందించడంలో దిట్టగా ముద్రపడింది. దేవి స్వరకల్పనలో ఇటీవల విడుదలైన "శంకర్‌దాదా జిందాబాద్" డివైడ్ టాక్‌తో నడుస్తున్నా ఆయన అందించిన స్వరాలు ఆదరణ చూరగొంటున్నాయి. ఈ సందర్భంగా దేవీశ్రీ ప్రసాద్‌తో కాసేపు...
 
  1 | 2 | 3  >> 
మరిన్ని
అది కోల్పోయానేమో అనిపిస్తుంది: షీలా
ఆ పెళ్ళికి పిలవండి.. నేను కూడా వస్తా: నిఖిత
భానుమతిగారిలా నటిస్తూ.. పాడడం...
మనసులో దాచుకోకుండా అన్నీ చెప్పేస్తుంటాం : ప్రేమ
మీరు ఎవరి కోసం మారొద్దు: రామ్ చరణ్
వేదికతో వెబ్‌దునియా టాక్