పచ్చదనాన్ని పెంపొందించటం నా బర్త్ డే స్పెషల్: నాగ్
| ప్రశ్న: పుట్టినరోజు శుభాకాంక్షలు నాగార్జునగారూ... ఈ పుట్టినరోజున ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? జ: ప్రతి పుట్టినరోజున నా స్టూడియోలోనే అభిమానులను కలుస్తుంటాను. వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాను. అదంతా మా తృప్తికోసం చేస్తుందే. లాస్ట్ ఇయర్ 25వేల మొక్కలు నాటాం. వారి వారి ఇంటి దగ్గర, వారి వారి ఊళ్ళలో నాటే ఏర్పాట్లు చేశాం. మొక్కలు నాటి వదిలేయకుండా ఐదు అడుగులు ఎత్తు వచ్చేదాకా బాధ్యతగా చూసుకునేట్లు చర్యలు తీసుకున్నాం, ఈ ఏడాది 50వేల మొక్కలు నాటాలనే పనిలో ఉన్నాం. ఒక్కోసారి విస్తరణ సమయంలో పెద్ద పెద్ద చెట్లు నరికివేయడం చూస్తే జాలేస్తున్నా... అది విస్తరణ అవసరం రీత్యా మరో మార్గంలేక చేస్తుందనే అని సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ప్రశ్న: మీ "డాన్" గురించి కాస్త చెపుతారా? జ: కథగా ఎక్కువ చెప్పలేను. స్క్రీన్‌ప్లే, కథ స్పీడ్ బాగుంటుంది. డాన్ అనే పాత్ర లారెన్స్ టైప్‌లో లో లెవల్‌నుంచి పైకి ఎదిగే పాత్ర. ఏ ప్రజలయితే తనను పైకి తీసుకువచ్చారో వాళ్ళకే సాయం చేస్తూ వారికి అండగా ఉంటాడు. ప్రశ్న: "డాన్" మహిళలను ఏవిధంగా ఆకట్టుకుంటాడు? జ: "మాస్"ను మహిళా ప్రేక్షకులు బాగానే చూశారు. ఇది యాక్షన్ ఎంటర్‌టైనర్. "నిన్నే పెళ్ళాడుతా", "అన్నమయ్య", "శ్రీరామదాసు" వీటిని ఎక్కువగా యూత్, మహిళలే చూశారు. కనుక ఫలానా సినిమా ఫలానా వారికే అని చెప్పలేం. ఇది అందర్నీ మెప్పిస్తుందని చెప్పగలను. ప్రశ్న: సంగీతం కూడా అతనికే అప్పగించారు. ఇందుకు ప్రత్యేక కారణం ఉందా? జ: "మాస్" టైమ్‌లో లారెన్స్‌కు మ్యూజిక్ టేస్ట్ ఉందని తెలుసుకున్నాను. దేవీశ్రీప్రసాద్‌తో తదనుగుణంగా బాణీలు రాబట్టుకున్న విధానం నచ్చింది. సెట్లో పాటలు పాడుకుంటూ ఉంటాడు. అలాగే డాన్ సినిమాకు రెండు పాటలు రికార్డ్ చేసుకువచ్చాడు. బాగా ఉన్నాయి, ఎవరా మ్యూజిక్ డైరక్టర్ అన్నాను. నేనే చేశానని చెప్పారు. నిర్మాత కూడా బాగున్నాయని చెప్పారు. అంత బాగా చేయించాక ఓకే చేశాం, 4 పాటలు రికార్డింగ్ అయ్యాయి. మెలోడీ, మాస్ బాణీలు ఉన్నాయి. ఇంకా రెండు పాటలు చేయాలి. అవీ విన్నాను, అన్నీ సవ్యంగా జరిగితే డిసెంబర్ 20న సినిమా విడుదల అనుకుంటున్నాం.
|
