తేజకు కోపం ఎక్కువ: కాజల్ అగర్వాల్
|
మీ గురించి చెప్పండి?
మాది పంజాబ్‌లోని అమృతసర్. అయితే.. పుట్టి పెరిగింది మాత్రం ముంబైలో. మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేశాను. ముంబైలోని ఓ సంస్థ నిర్విహించే కల్చరల్ షోలలో పాల్గొనేదాన్ని. హిందీలో సినిమా అనే మూవీలో చేశాను. అందులో నన్ను చూసిన దర్శకుడు భారతీరాజా 'కాళిదాసు' చిత్రంలో అవకాశం కల్పించారు. అది తెలుగులో కూడా అనువాదమైంది. అయితే.. తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మీకళ్యాణం' చిత్రమే తెలుగులో స్టైట్ చిత్రం.
తేజకు కోపమెక్కువ. అవసరమైతే చేయి చేసుకుంటారని వినికిడి. మరి మీ విషయంలో ఎలా నడుచుకున్నారు.?
ఆయనంటే నాకెంతో గౌరవం. ఆ చిత్రంలో చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను. కెమెరాను ఏ విధంగా ఫేస్ చేయాలి అనే టెక్నికల్ పాయింట్లతో పాటు.. డైలాగ్ డెలివరీ ఎలా ఉండాలి. సన్నివేశాన్ని బట్టి ఆరోహణ, అవరోహణలు ఎలా మార్చుకోవాలి అనే చాలా విషయాలు నేర్చించారు. అతను ముక్కోపి. కానీ అదే నటనలో హెల్ప్ అయ్యేది. నా దృష్టిలో అతనొక ప్రొఫెనల్. సిన్సియారిటీ, పంక్చువాలిటీ ఉన్న వ్యక్తి. 'లక్ష్మీకళ్యాణం'లో గ్రామీణ అమ్మాయిగా నటించాను. ఇక్కడి సంస్కృతి, పద్దతులన్నీ ఆయన వివరించారు.
మీరు ఎపుడైనా తెలుగు చిత్రాలు చూశారా?
ఓ ఎస్... చూశాను. మురారీ, ఖడ్గం, జయం, నువ్వు నేను, బొమ్మరిల్లు, పోకిరి, మన్మథుడు..ఇంకా చాలా ఉన్నాయిలెండి.
మీరు చూసిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు.?
నా బెస్ట్ నటుల్లో డాన్. ఆయనే.. అక్కినేని నాగార్జున ఒకరు.
షూటింగ్ లేనప్పుడు ఎలా టైమ్ పాస్ చేస్తారు?
ఇంకేముంది... పుస్తకాలు చదవడంలో లీనమైపోతాను. స్నేహితులతో ఛాటింగ్ చేస్తాను. వీటన్నిటి కంటే.. యోగాకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. ముఖ్యంగా ఎక్కడ ఉన్నా సమీపంలోని జిమ్ సెంటర్‌కు మాత్రం వెళతాను.
|
మంచి పాత్రలు చాలా చేయాలి. ఆ తర్వాతే డ్రీమ్ రోల్ గురించి ఆలోచిస్తాను.
ముంబై నటీమణులు ఐటం సాంగ్‌లు కూడా చేస్తుంటారు కదా? మీకు కూడా అలాంటి ఆలోచన ఏదైనా ఉందా?
నాకస్సలు అలాంటివి చేయడం ఇష్టం లేదు.
తేజ, కృష్ణవంశీలో మీరు గ్రహించిన వ్యత్యాసం?
ఇద్దరూ సృజనాత్మక గల దర్శకులే. కానీ ఇద్దరిలో కొన్ని తేడాలు ఉన్నాయి. తేజ డిసిప్లిన్‌కు ప్రాధాన్యత ఇస్తారు. హార్డ్ వర్క్ చేస్తారు. అవసరమైతే కొన్ని సన్నివేశాల్లో చేసి చూపిస్తారు. కృష్ణవంశీ బుజ్జగించినట్లుగా ప్రవర్తించి దర్శకుడిగా అతనికి కావాల్సింది రాబట్టుకుంది.
ఏ భాషలో ఎక్కువగా నటించాల్సి ఉంది.?
ఏ భాషలో నటించినా హిందీలో డైలాగ్స్‌లు రాసుకుని చెబుతుంటాను. ప్రామ్‌టింగ్ లేకుండా నేను డైలాగ్‌లు చెబుతాను.
సరేగానీ.. మీ కొత్త సినిమాల వివరాలు చెపుతారా?
ప్రస్తుతం నితిన్ చిత్రం. ఆ తర్వాత సుమంత్ హీరోగా రాజా ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో నటించనున్నాను. తమిళంలో భరత్ హీరోగా పేరరసు దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నాను.
