1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

సక్సెస్ ఉంటేనే పండుగ: ఇ.వి.వి

సక్సెస్ ఉంటేనే పండుగ ఇ.వి.వి
దసరానాడు స్టేజీ ప్రోగ్రామ్‌లు ఉండేవి.... ఏదో ఒక ప్రోగ్రామ్.... తోలు బొమ్మలాట, సాంఘిక నాటకాలు, ఇలా ఉండేవని అన్నాడు... పెళ్ళందికానీ... దర్శకుడు ఇవివి. సత్యనారాయణ. ఆనాడు... ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం.. అని ఇవివి. పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు.

నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ రాజమండ్రిలోని రామచంద్రాపురంలో మా ఊరిలో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళమిని దసరా సందర్భంగా ఈ విషయాలను తెలియజేశాడు. పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు, పిండి వంటలు చేయడం తినడం అదొక సరదాగా ఉండేవని చెప్పాడు.

ఇప్పుడివన్నీ గుర్తు చేయాల్సి వస్తుంది. రోజువారీ బిజీలో ఫలానా పండుగ అని టీవీల్లోనే వినిచేసుకోవాల్సివస్తుంది. రాను రాను పండుగ వాతావరణం కనుమరుగై పోతుందని ఇ. వి. వి. సత్యనారాయణ విజయదశమి సందర్భంగా "వెబ్‌దునియా"కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాకుండా సక్సెస్ ఉంటేనే పండుగ... లేదంటే పండుగ లేదని సత్యనారాయణ చెప్పారు.
About Writer
Selvi