1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

నిజమైన పండుగ ఇది: సంఘవి

నిజమైన పండుగ ఇది: సంఘవి
ఈ దసరా నాకు దుర్గాదేవీ అమ్మవారు ప్రసాదించిన కానుకగా చెప్పుకోవాలి. చాలా రోజులు తర్వాత తెలుగులో నటించే అవకాశం "ఇంద్రాణి" రూపంలో నాకు దక్కింది. చిన్నతనంలో దసరా పండుగను స్నేహితుల మధ్య మైసూరులో జరుపుకునేదాన్ని. ఆ రోజులే వేరు. నటిని అయిన తర్వాత దసరా పండుగను జరుపుకునే సందర్భం రాలేదు.

ఈ పండుగ తెలుగు ప్రేక్షకుల వాకిళ్లలో ఆనందోత్సాహాలను కలుగజేస్తుందని కోరుకుంటున్నాను. ఒక గ్రామంలో టీచర్‌గా పనిచేస్తున్న తనకు జరిగే అన్యాయాన్ని ఎలా ఎదిరించాననే చిత్ర కథలో నటించడం కొత్త అనుభూతినిస్తుందని సంఘవి వెబ్‌దునియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపింది.

చాలా కాలం తరువాత లేడీ ఓరిటెంటెడ్ కథాంశంతో కూడిన పాత్ర చేయడంలో ఆనందంగా ఉందని ఈ చిత్రం అందరినీ అలరించే చిత్రమవుతుందనే నమ్మకాన్ని సంఘవి వ్యక్తం చేశారు.
About Writer
Selvi