గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ముఖాముఖి » తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి: ప్రిన్స్ మహేష్
ముఖాముఖి
Feedback Print Bookmark and Share
 
తండ్రి నుంచి నటవారసునిగా తెలుగు వెండి తెర ప్రవేశం చేసిన మహేష్ బాబు.. అంచలంచెలుగా ఎదిగి తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. భవిష్యత్ అంతా తమ యూత్ హీరోలదేననీ, తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లడానికి తనవంతు కృషి చేస్తానని ఈ ప్రిన్స్ అంటున్నారు. అయితే. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో మాత్రం నటించనని అంటున్నారు.

థమ్స్ అప్ అంబాసిడర్ వల్ల ఫ్యాన్స్ మరింత దగ్గరయ్యారని, ఇందుకుగాను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. తన చిత్రాలకు వచ్చే టైటిల్స్ అన్నీ మూడు అక్షరాలతో రావడం సెంటిమెంట్ కాదనీ, అంతా యాదృశ్చికమేనని చెపుతున్న మహేష్ బాబు (భార్య పేరు నమ్రత, కొడుకు గౌతమ్ కూడా మూడు అక్షరాల పేర్లే) హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

ప్ర.. అతిథి ఆర్థికంగా లాభించిందా? సక్సెస్ అనుకుంటే ఎలా ఫీలవుతున్నారు?
మొదటి వారం కలెక్షన్స్ రిపోర్ట్స్ చూశా. ఊహించిన దానికంటే.. ఎక్కువగా వచ్చాయి. ఇదంతా నాన్నగారి అభిమానుల వల్లే. విపరీతంగా ఓపెనింగ్స్ దక్కాయి. అందువల్లే ఆర్థికంగా లాభించింది.

ప్ర.. వరుసగా యాక్షన్ సినిమాలే చేయడానికి కారణం.?
ముఖ్యంగా బడ్జెట్. దానివల్లే యాక్షన్ చిత్రాలు చేయాల్సి వస్తోంది. చిత్రాల్లో యాక్షన్‌తో పాటు.. సెంటిమెంట్ ఉంటేనే బిజినెస్ అవుతుంది. యాక్షన్ చిత్రాల్లో ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పొటన్షియాలిటీ కూడా యాక్షన్ చిత్రాల ద్వారానే వచ్చింది.

ప్ర.. మీతో జేమ్స్‌బాండ్ చిత్రం చేయాలని దర్శకుడు సురేందర్ రెడ్డి అంటున్నారు. దీనిపై మీ కామెంట్?
ఇపుడిపుడే తెలుగు సినిమా ఎదుగుతోంది. ఇప్పుడున్న స్టైల్, ట్రెండ్‌కు అపుడే జేమ్స్ బాండ్ చిత్రాలు చేయలేను. దానికి కొంత టైమ్ పడుతుంది.