గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ముఖాముఖి » నాది ప్రేమపెళ్ళి కాదు: "మిస్టర్ మేధావి"
ముఖాముఖి
Feedback Print Bookmark and Share
 
Raja
WD PhotoWD
ఓ "చినదానా" చిత్రంలో సెకండ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కుర్రాడు రాజా. ఈ చిత్రానికి ముందు ప్రముఖ కంపెనీల యాడ్స్‌లోనూ... మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ నటించాడు. తొలి చిత్రంతోనే నటునిగా చక్కటి పేరు సంపాదించుకున్న రాజాకు గుర్తింపు వచ్చిన చిత్రం "ఆనంద్". తర్వాత కొన్ని చిత్రాలు చేసినా అంతగా గుర్తింపు రాకపోయినా... అడపాదడపా సపోర్టింగ్ క్యారెక్టర్లు చేశాడు. అలా చేయడం బతుకు తెరువుకోసమేనని నిర్మొహమాటంగా చెబుతున్నాడు.

తాజాగా నీలకంఠ దర్శకత్వంలో "మిస్టర్ మేధావి" చిత్రంలో నటిస్తున్నాడు. ఇది ఆనంద్‌కు మంచి గుర్తింపును సాధించి పెడుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. తన పుట్టినరోజును ఎప్పుడూ చాలా సరదాగా జరుపుకుంటాననీ, తానేకాకుండా లోకమంతా ఆనందంగా జరుపుకుంటుందని చలోక్తి విసిరాడు. ఎందుకంటే తాను పుట్టింది దీపావళినాడని చెప్పాడు. ఈ ఏడాదిలో తన సినీకెరీర్‌లో ఆరు సంవత్సారాలు పూర్తయి ఏడవ అడుగు వేస్తున్నానని తెలిపాడు. ఈ సందర్భంగా రాజాతో కాసేపు...

ప్రశ్న: ఈ ఆరేళ్ళు బేరీజు వేసుకుంటే ఎలా అనిపిస్తుంది?
జ: 2001 నవంబర్‌లో నా సినీ కెరీర్ ప్రారంభమైంది. ఇంతకాలం ఉన్నానంటే ప్రేక్షకుల ఆశీర్వాదమే కారణం. మంచి చెడుల్లో కూడా వారు నాకు సపోర్ట్‌గా ఉన్నారు. కొన్ని సినిమాలు ప్లాప్ అయినా నా పాత్రపరంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఎంపికలో కొన్ని తప్పులు చేసినా ఇండస్ట్రీ చాలా సపోర్ట్ ఇచ్చింది. అయినా ఇప్పటికీ నటునిగా స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉన్నాను.