ప్రధాన పేజి   వినోదం > వెండితెర > ముఖాముఖి
 
దేవుడిచ్చిన ఈ జీవితం విలువైంది: ముమైత్‌ఖాన్
Mumaithkhan
WD PhotoWD
సెక్సీ స్టార్‌గా శృంగార రసాన్ని ఒలకబోస్తూ ముఖ్యంగా కుర్రకారును వెర్రెత్తిస్తూ అనూహ్యంగా అందరి మన్ననలను అందుకుంటున్న నటీమణి ముమైత్‌ఖాన్. జయమాలిని, జ్యోతిలక్ష్మి తరహాలో ఐటం సాంగ్స్‌ చేస్తున్న అభినయశ్రీని మరచిపోయేలా చేసిన ఘనత ఒక్క ముమైత్‌ఖాన్‌కే దక్కింది. పోకిరి చిత్రంలో ఇప్పటికింకా నా వయస్సు.. అంటూ చిన్న కుర్రాడి చేత కూడా స్టెప్పులు వేయించిందీ సెక్సీ సుందరి. ఎవడైతే నాకేంటి చిత్రంలో ఇన్‌స్పెక్టర్ పాత్రను చూసి మెచ్చి ఆమె కోసమే ప్రత్యేకమైన కథను తయారు చేసి మైసమ్మ ఐపీఎస్ చిత్రం ద్వారా ఆమెను ఏకంగా హీరోయిన్‌ చేసేశారు దర్శకుడు దాసరి నారాయణరావు. తాను హీరోయిన్ అయినా ఐటం సాంగ్స్‌లో నటిస్తానని గట్టిగా చెబుతోందీ ఈ నటీమణి తాజాగా మంగతాయారు టిఫిన్ సెంటర్‌లోను కథానాయిగా నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమెతో చిరు ఇంటర్వ్యూ....

మైసమ్మ ఐపీఎస్ చిత్రంపై మీ ఫీలింగ్ ఏమిటి..?
నేను హీరోయిన్ అవుతానని కలలో కూడా అనుకోలేదండి. ఒకరోజు అనుకోకుండా దాసరి గారి మేనేజర్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. నేను ఏదోలే ఐటం సాంగ్ ఉంటుందనుకుని వెళ్తే ఆయన కథ గురించి చెబుతూ అందులో నా పాత్రను చెప్పేసరికి ఒక్క సారిగా షాక్ తిన్నాను. ఏమైతేనేం... ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చాయి. ఇది ఆ దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తాను.

కొన్ని సన్నివేశాలు ఆంగ్ల చిత్రం 'బిల్‌కిల్‌'ను పోలి ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ చిత్రం మీరు చూశారా..?
యస్ యు ఆర్ రైట్... బట్ ఆ సినిమా నేను చూశాను... కాని పూర్తి స్థాయిలో ఆ చిత్రం ఆధారంగా తీయలేదు. చివరి సన్నివేశం చెక్కలో సమాధి చేసి పూడ్చి పెట్టినది మాత్రమే అందులోది...

యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ ఏదైనా తీసుకున్నారా..?
నో.. అలాంటిదేమీ లేదు... ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ అంతా అబ్బాయిలాగానే ఉంటుందని, నా ప్రవర్తను కూడా అలాగే ఉండడం చేత యాక్షన్ సన్నివేశాలను నువ్వు చెయ్యగలవని అంతా అన్నారు. అంతే కాకుండా.. ఫైటర్స్ రామ్‌లక్ష్మమ్‌లు చాలా టిప్స్ చెప్పించడంతో నాకు ధైర్య వచ్చింది.
  1 | 2  >> 
మరిన్ని
ఎంత మంది వచ్చినా నాకు పోటీ లేదు: గజాలా
నాది ప్రేమపెళ్ళి కాదు: "మిస్టర్ మేధావి"
ఆయనతో నటించడం లక్‌: కమలిని ముఖర్జీ
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి: ప్రిన్స్ మహేష్
ఏడిపించే సీన్...టైసన్ పాత్రంటే ఇష్టం: శేఖర్ కమ్ముల
నిజమైన పండుగ ఇది: సంఘవి