మీరు మరీ శృంగారాన్ని ఎక్కువగా చేస్తున్నారని ఇండస్ట్రీ భావిస్తోంది. మరి ప్రేక్షకులు కూడా అలాగే ఫీలవుతున్నారు... వస్త్రాలను అతి తక్కువగా వినియోగించుకుని డాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారని చాలా మంది నన్ను అడిగారు. అయితే అసలు ఎక్స్‌పోజింగ్ అంటే ఏంటి..... నటనలో ఓ భాగమనేగా.. సరే ఒక వేళ ప్రేక్షకులకు నచ్చలేదంటే అవి ఫ్లాప్ కావాల్సిందేగా... అంటే ప్రేక్షకులకు డ్యాన్స్‌లు కావాలనేగా దీని అర్థం. అందుకనే దర్శకులు మాచేత ఇలా చేయిస్తున్నారు.
హీరోయిన్‌గా చేస్తున్నారు మరి ఐటం గార్ల్‌గా నటిస్తారా...? నేను ఐటం గార్ల్ అని అనుకోవడం లేదు... నేను పూర్తి స్థాయి డ్యాన్సర్‌ని.. పదమూడేళ్ల వయసులో నేను డ్యాన్సర్‌గా మారాను.. చేతిలో రూపాయి లేని రోజుల్లో డ్యాన్సర్‌గా మారి లోకాన్ని చదివాను. ముంబైలో రూ. 1500లతో ప్రారంభమైన నా సంపాదన ఇప్పుడు 15 లక్షలకు చేరుకున్నాను. ఇంత స్థాయి నాకు రావడానికి కారణం ఆ దేవుడు నాకిచ్చిన విలువైన బహుమతిగా భావిస్తున్నాను. ప్రస్తుతం నేను హీరోయిన్‌గానే కాదు.. ఐటం డ్యాన్సర్‌గాను కూడా నటిస్తాను.
షూటింగ్ మీ కారణంగా ఆలస్యమవుతోందిని విమర్శలు వస్తున్నాయి. నిజమేనా...? నేనూ విన్నాను.. కాని అది తప్పు కాదు.. సపోజ్.. నేను ఫలానా సాంగ్‌కు ఫలానా కాస్ట్యూమ్స్ వేయలని చెప్తారు.. సరిగ్గా నేను షూటింగ్‌కు వచ్చి డ్రెస్ అడిగే టైంకు కాస్ట్యూమ్స్ మారిపోయేవి. మాకు ఇవే చెప్పారనే కాస్ట్యూమర్ అనేవాడు. దర్శకుడి వారిని మందలిస్తే అప్పటికప్పుడు వాళ్లు డ్రెస్ కోసం బయటకు వెళ్లేవారు.. సో... ఇది నా తప్పెలా అవుతుంది చెప్పండి..
ధోలారిధనిలో మీ ప్రవర్తన సరిగ్గా లేదని వార్తలు వస్తున్నాయి... మరి మీరేమంటారు...? నో నో... అది అబద్ధం.... అటువంటి వార్తలంటేనే నాకు అసహ్యం.... వీడు మామూలోడు కాదు చిత్రంలో ఐటం సాంగ్ చేస్తున్నా... ఆరోజు నా ఆరోగ్యం బాగలేదు... కానీ డేట్స్ ఇచ్చాను కదా అని వచ్చాను. వచ్చాక తలనొప్పి ఎక్కువైంది. దీనికోసం ట్యాబ్‌లెట్ వేసుకుని ఓ బాటిల్లో నీరు త్రాగాను... దాన్ని పూర్తిగా మార్చేసి 'సెట్లోనే మందుకొడుతున్న ముమైత్' అంటూ వెబ్‌సైట్‌లో రాసేశారు.. ఇది టూ... మచ్..
మీ భవిష్యత్ ప్రణాళికలు.... చెప్పగలరా..? ముంబైలో పెరిగినా హైదరాబాద్ నాకా చాలా బాగా నచ్చింది. ఇక్కడే ఓ ఇళ్లును కొనబోతున్నాను. మా అమ్మనాన్నలను చూడాల్సిన బాధ్యత నాపై ఉంది. వారు నాతోనే ఉంటారు... ముంబైలో అవకాశాలు వచ్చినా వచ్చి వెళుతుంటాను.
|