గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ముఖాముఖి » స్క్రిప్ట్ ఉంటే మల్టీ స్టారర్ చిత్రాలకు సిద్ధమే: విక్టరీ
ముఖాముఖి
Feedback Print Bookmark and Share
 
Victory
WD PhotoWD
ఫ్యామిలీ ఒరియెంటెడ్ చిత్రాలే గాక.... లవ్, యాక్షన్, మాస్, క్లాస్ చిత్రాల్లోను నటించి ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఒక్క విక్టరీ వెంకటేష్‌కే దక్కుతుంది.. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు.. పెళ్లిచేసుకుందాం.. ప్రేమించుకుందాం రా... ప్రేమంటే ఇదేరా.. కలిసుందాం రా... ఘర్షణ.... లక్ష్మీ... ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ...ఆ తర్వాత ఇప్పుడు తులసీ... ఇలా వీటిలో ప్రతీ చిత్రంలోను వైవిధ్యం కనబరుస్తూ విక్టరీ అన్న ముద్రను వేశాడు వెంకటేష్...

డిసెంబర్ 13న వెంకటేష్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ.... ముందుగా

తులసీ చిత్రం నుంచి చిత్రాల టైటిల్స్‌లో మహిళా ప్రాధాన్యత కలిగిన టైటిల్స్ పెట్టారు.. కారణం..?
కథా పరంగా వచ్చిన టైటిల్స్‌ను దర్శక, నిర్మాతలు నా దృష్టిటి తీసుకురాగా అవి నాకది బాగుంది అనిపిస్తే ఆ టైటిల్‌నే ఖరారు చేస్తాం.. అయితే మల్లీశ్వరి నుంచి నేటి తులసి టైటిల్స్ వరకు వినడానికే కాక, మహిళలకు సంబంధించిన అంశాలు ఉన్నాయన్న ఉద్దేశ్యంతోనే ఆ టైటిల్స్ పెట్టామే గాని.. అందులో ప్రత్యేకత లేదు..

తులసీ చిత్రంలో వాయ్‌లెన్స్ ఎక్కువయిందని విమర్శలు వస్తున్నాయి.. మరి మీరేమంటారు..?
గత చిత్రాల్లో యాక్షన్ అంశాలు పెద్దగా లేనందువల్ల ఈ చిత్రాన్ని చూసి అలా అనిపించి ఉండవచ్చు.. మరో విశేషమేమిటంటే తులసీ కంటే మరింత ఎమోషనల్‌, యాక్షన్ సన్నివేశాలు మరింతగా ఉండాలని అభిమానులు కోరుతున్నారు..

అయితే మీ తర్వాత చిత్రం కూడా యాక్షన్ ప్రధానాంశంగా చేయనున్నారా...?
అలా అని ఏం లేదు... ప్రస్తుతం కథలను వింటున్నాను.. చివరకు ఏది ఖరారవుతుందో చెప్పలేం.. బాడీ లాంగ్వేజ్ తగ్గ సబ్జెక్ట్ దొరకాలిగా.. అలాంటి సబ్జెక్ట్ వచ్చిందంటే యాక్షన్ అనే కాదు.. ఎంటర్‌టైన్‌మెంట్, డ్రామా, సెంటిమెంట్ అంశాలు గల చిత్రాలైనా ఫర్వాలేదు..