టాలీవుడ్ హాండ్‌సమ్‌గా పేరొందిన నాగార్జున వెండి తెర ప్రేక్షకుల్లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. మాస్ చిత్రం తర్వాత శ్రీరామదాసులో నటించారు. ఇటీవల ఆయన నటించిన చిత్రం డాన్... నాగార్జున కొత్త తరహా గెటప్‌లో నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. కీర్తి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మాణ సారథ్యంలో చిత్రీకరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు ముగించుకున్న ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలవుతున్న సందర్భంగా యువసామ్రాట్‌తో జరిపిన ఇంటర్వ్యూ..
భారీ అంచనాలతో విడుదలవుతున్న డాన్ చిత్రం కథ ఏంటి..? హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ కథలో ఇద్దరు డాన్‌ల మధ్య జరిగే పవర్‌ఫుల్ గేమ్ ఈ చిత్రం. అంతా ఏదో ఇంగ్లీష్ సినిమా చూసినట్లే ఉంటుంది.
లారెన్స్ కూడా మీతో పాటు నటించాడని అంటున్నారు..? ఎస్.. నాకు తమ్ముడిగా నటించాడు.. అతనికి జోడీగా నిఖిత నటించింది..
ఈ చిత్రంలో మీకు నచ్చిన అంశాలేమిటి...? యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో సీక్వెల్స్ చెప్పిన విధానం నచ్చింది..