పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఏదో చిన్న చిన్న వేషాల కోసం తెలుగు ఇండస్ట్రీకి చేరి తొలుత ఓ టీవీ యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన నటుడు, ప్రస్తుత హీరో శివాజి. తొలి నాళ్లలో శివాజి హీరోకు తోడుగా ఉండే పాత్రల్లో నటించి ఆ తర్వాత తనేంటో నిరూపించుకుని కథానాయకుడిగా ఎదిగాడు.
ఇంద్ర చిత్రంలో పడవ నడిపే వాడి పాత్రను, ఖుషీలో పవన్ స్నేహితునిగాను నటించాడు. అలాగే తాజాగా స్టేట్ రౌడీలో హీరోగా నటించాడు. అలాగే ఛార్మి ప్రధాన పాత్రలో నటించిన మంత్ర చిత్రంలోను కీలక పాత్ర పోషించి... ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జల్సా చిత్రంలోను శివాజి నటిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు...
మాస్ చిత్రాలు మీకు నప్పలేదని ప్రేక్షకులు అంటున్నారు...అయినా అవే తరహా చిత్రాలు చేయడంలో మీ ఉద్దేశ్యం..? డైరెక్ట్‌గా అడిగేశారు.. చాలా థ్యాంక్స్... మిస్సమ్మ తర్వాత నాకు అన్ని అటువంటి తరహా పాత్రలే వస్తే చేయనన్నాను. కొంచెం కొత్తగా ఉండాలని స్నేహితుడు యలమంచి రవి మాస్‌గా ఉండే పాత్రలు అయితే బావుంటుందని సీతారాముడు తీశారు.
అయితే ఆ చిత్రం బాలేదని ఎవరూ అనలేదు. సినిమా పెద్దగా ఆడకపోయినా.. నా ఫెర్‌ఫార్మెన్స్ ఓకే అని అందరూ చెప్పారు. ఇక స్టేట్‌రౌడీ చిత్ర విషయానికొస్తే ఆ చిత్ర క్యాప్షన్‌లోనే ఉంది వాడికంత సీన్ లేదని.. దానికి తగ్గట్టే కామెడీ ఉంటుంది. అయితే ఎందుకనో ప్రేక్షకులు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు.
సక్సెస్‌లు లేకపోయినా.. లక్కీ హీరో అని ఇండస్ట్రీ అంటోంది... దీనిపై మీ ఫీలింగ్..? ఈ మాటను ఒకప్పుడు శ్రీకాంత్‌ను అనేవాళ్లు... సినిమాలు చూస్తుంటాం.. వాటి విజయం.. అపజయం మన చేతుల్లో లేదు. నాకు సక్సెస్ లేకపోయినా నన్ను నటునిగా అందరూ గుర్తించారు కాబట్టే అవకాశాలు వస్తున్నాయి.