కాలేజీకి చీరకట్టుకుని వెళ్తారా:..?! జెనీలియా
| అయితే "సత్యం" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ భామ నటనకు రాకముందు మోడల్‌గా చేసేది. పార్కర్ పెన్నులు, ఫెయిర్ అండ్ లౌవ్లీ వంటి ఉత్పత్తులకు ప్రచారకర్తగా చేసింది. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన "నువ్వే కావాలి" చిత్రం ఆధారంగా నిర్మితమైన "తుఝేమేరీ కసమ్" అనే చిత్రంతో బాలీవుడ్‌కు పరిచమైంది. ఆ చిత్రం ఘోర పరాజయం చెందడంతో బాలీవుడ్‌లో నిలదొక్కుకోలేక పోయింది. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన "బాయ్స్" చిత్రంలో అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అక్కడ నుంచి ఈ భామకు తెలుగులో అవకాశాలు రాసాగాయి. 'సై', 'సాంబ', 'బొమ్మరిల్లు', 'ఢీ', 'మిస్టర్ మేథావి' వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆమెతో "వెబ్‌దునియా తెలుగు" సాగించిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం... ప్రశ్న:- నేటి సమాజంలో వస్త్రధారణ ఎలా వుండాలని అనుకుంటున్నారు? జ:- ఇదే విషయమై ఓ సారి నాకు దర్శకులకు మధ్య వాదన జరిగింది. (సినిమా పేరు వద్దులెండి). మీరు మోడ్రన్‌గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పటి డ్రస్సులు ఇలాగే ఉంటాయని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఢిల్లీ, ముంబైలలో కాలేజీ అమ్మాయిలు ఎలా ఉంటారని నన్ను ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా శృతి మించని డ్రస్సులే వేస్తుంటాను.
|
