గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ముఖాముఖి » కాలేజీకి చీరకట్టుకుని వెళ్తారా:..?! జెనీలియా
ముఖాముఖి
Feedback Print Bookmark and Share
 
FileFILE
ప్రశ్న:- గ్లామర్ పేరుతో శృతిమించుతోందన్న విమర్శలకు సమాధానం?
జ:- అందరూ చెప్పేదే. పాత్ర స్వభావానికి తగినట్లుగా ఉంటుంది. దానికి తగినట్లే వస్త్రధారణ వేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు కాలేజీకి వెళ్ళే అమ్మాయి చీరకట్టుకుని వెళితే... అందరూ ఆంటీ అంటూ ఆట పట్టిస్తారు. అలాగనీ మనం చీరకట్టుకుని వెళ్లలేం కదా. అందుకే సందర్భోచితంగా మనం, మన వేషధారణ వుండాలని నా భావన.

ప్రశ్న:- నంది అవార్డు రావడం పట్ల మీరెలా ఫీలవుతున్నారు.?
జ:- నాకంటే మా తల్లిదండ్రులు గర్వంగా ఫీలయ్యారు. నా విజయాల వెనుక అండదండలు వారే. వాళ్ళు నన్నెంతో ప్రోత్సాహిస్తుంటారు. ముఖ్యంగా మా అమ్మ ఉత్తమ విమర్శకురాలు.

ప్రశ్న:- పరభాషా నటీమణికి అవార్డు దక్కడం ఎలా అనిపిస్తుంది?
జ:- ఇంతవరకు అలాంటి ఫీలింగ్ అనేది లేదు. నన్ను గుర్తించినందుకు జ్యూరీకమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆర్టిస్టుగా ఎక్కడున్నా నటన ఒక్కటే. కళారంగానికి మూలపురుషుడు నటరాజును అందరూ పూజిస్తారు. కళకు ప్రాంతీయ తత్వాలు ఉండవు కదా?

ప్రశ్న:- మీపై వచ్చే పుకార్లకు (గాసిప్స్‌) మీరెలా స్పందిస్తారు?
జ:- సినీగ్లామర్ పరిశ్రమలో పుకార్లు అనేవి సహజం. ఇవి కొన్ని సందర్భాల్లో మనసును గాయపరుస్తాయి. ఇలాంటి వార్తలు కూడా రాస్తుంటారా? అని బాధ కలుగుతుంది. ఏం చేయలేం కదా?

ప్రశ్న:- మీరు ఎలాంటి పాత్రలు చేయాలని భావిస్తున్నారు.?
జ:- గ్లామర్ పాత్రలకే మొదట ప్రాధాన్యత ఇస్తూ నటనకు అవకాశం ఉన్నవి చేస్తాను. గ్లామర్ ఫీల్డు గనుక గ్లామర్‌గా ఉండాలంటారు. ఏది చేసినా మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే లక్ష్యం.

ప్రశ్న... చిత్ర పరిశ్రమలో మీకు నచ్చిన నటీనటులు?
జ... షారూఖ్, కాజోల్, పవన్ కళ్యాణ్, సౌందర్య, స్నేహ.