జగపతిబాబు నటించడానికి కారణం..? ఆయన ఇన్‌స్పెక్టర్ పాత్ర పోషించారు. ఆ పాత్ర పవర్‌ఫుల్ పాత్ర. ఆయన ఇందులో నటించడం ఆయన గొప్పతనం. ఆయన చిన్నప్పుడు ఆయన తండ్రిని ఓ మాట అడుగుతాడు. పొలంలో వాళ్లనాన్న కలుపుమొక్కలు పీకేస్తుంటే.. ఎందుకు నాన్న అలా పీకుతున్నావ్..? అని అడిగితే... అవి ఏరిపారేస్తేనే మంచి పంట పండుతుంది. పంట కళకళలాడుతుందంటాడు. ఆ స్ఫూర్తితోనే నగరంలో రౌడీలనే కలుపుమొక్కల్ని ఏరిపారేస్తేనే సమాజం పచ్చగా ఉండగలదని భావిస్తాడు ఇన్‌స్పెక్టర్ జగపతిబాబు. ఈ చిత్రంలో ఈ మధ్య జరిగిన కొన్ని రియల్ సంఘటనలు కూడా ఉండటం విశేషం.
భారీ బడ్జెట్ కావడానికి కారణం..? నా కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రం ఇది. కథకు తగినవిధంగా పాడింగ్ ఆర్టిస్టులు, ఫారిన్‌లో పాటలు, చిత్రీకరణే 80 రోజులు పట్టడం. నిర్మాత దేనికీ కాంప్రమైజ్ కాకుండా తీయడంతో భారీగానే అయ్యింది.
'ఖడ్గం', 'యమగోల', 'ఆపరేషన్ ధుర్యోధన', 'నగరం' ఈ సారి ఏ తరహా పాత్ర చేయబోతున్నారు..? ఖడ్గం తర్వాత కొత్త తరహా పాత్రలు చేయాలనే అనుకున్నాను. రొటీన్ పాత్రలకంటే అదే బెటర్ అని నా అభిప్రాయం. దీనికి అజయ్‌దేవగన్ ఇన్‌స్పిరేషన్. అందుకే చిత్రచిత్రానికి వైవిధ్యంగా కనిపించాలనుకుంటాను. ఈ చిత్రంలో కేశాలంకరణ, రఫ్‌గా ఉండటం, కళ్లల్లో పొగరు ఇలా కనిపించేలా ఉంటుంది. యమగోలలో పాత్రకు ఎన్‌టీఆర్ స్ఫూర్తి. అలాగే ఆపరేషన్ ధుర్యోధనలో కొత్తతరహా పాత్ర.. ఇలా వేరియేషన్స్ ఉన్న పాత్రలే చేయాలనే నిర్ణయించుకున్నాను. ఏదైనా కొత్త దనం చేస్తేనే కదా ప్రేక్షకుడు రిసీవ్ చేసుకోగలరు. లేదంటే రొటీన్ అయిపోతుంది. ఆపరేషన్... చిత్రం చేస్తున్నప్పుడే చాలా మంది శ్రేయోభిలాషులు సున్నితంగా హెచ్చరించారు కూడా.. ఏది ఏమైనా ఒకటి సక్సెస్ అయితే ధైర్యం వస్తుంది. ఆ దిశగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించాలనిపిస్తుంది.
కొత్త దర్శకుడిని ఎంపికచేయడంలో విశేషం..? సీసీ దాదాపు నా అన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా, అసోసియేట్, కో డైరెక్టర్‌గా పనిచేశాడు. కృష్ణవంశీ సినిమాలకు చేశాడు. ముందుగా మలయాళ దర్శకుడిని అనుకున్నాం. స్టోరీ చర్చల్లో చాలా హెల్ప అయ్యాడు. అప్పుడనిపించింది. ఎక్కడో ఉన్న డైరెక్టర్ ఎందుకు. మన దగ్గరున్న సీసీనే పెడదామనుకున్నాం.
కృష్ణవంశీ పాట చేయడానికి కారణం..? కేవలం ఫ్రెండ్‌షిప్‌తోనే చేశాడు. నాకు నిర్మాత అంజిబాబు కృష్ణవంశి స్నేహం పైనే పాట చేశాడు.
మైఖేల్‌మదనకామరాజు పాత్ర ఎలా ఉంటుంది..? ఇందాక చెప్పినట్లే.. ఇదొక వైవిధ్యమైన పాత్ర. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌ను తీసుకుంటే అన్ని తరహా పాత్రలు చేస్తుంటారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ఈ పాత్ర చేస్తున్నాను. ఎంటర్‌టైన్‌మెంట్,/ ఫ్యామిలీ, మాస్ అందరూ నా చిత్రం చూసేట్లుగా ఉంటుంది.
మల్టీస్టారర్ చిత్రాలపై..? నేను చేస్తూనే ఉన్నాను. సంక్రాంతిలో వెంకటేష్‌తో, శంకర్‌దాదా ఎంబీబీఎస్ .. జిందాబాద్‌లో చిరంజీవితో, అలాగే పండుగ, సకుటుంబసపరివారంలో అక్కినేనితో చేశాను. కానీ సీనియర్ ఎన్టీఆర్‌తో చేసే అవకాశం రాలేదు.
కొత్త ప్రాజెక్టులు..? రామానాయుడుగారి సినిమా. సూర్యతేజ దర్శకుడు. లాంకో శ్రీధర్ నిర్మాతగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వం చేయబోతున్నారు. మేలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. అదే విధంగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో మహిళలు మెచ్చే కథాంశం. ఆర్ట్ సినిమాలా ఉండేది అనుకున్నాం. ఇంకా టైం పడుతుంది.
|