ప్రధాన పేజి > వినోదం > వెండితెర > ముఖాముఖి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మంచి అమ్మగా నిలబడాలని ఆశిస్తున్నా: సాక్షి
సముద్రం చిత్రంలో జగపతిబాబుతో నటించడంపై మీ అభిప్రాయం..?
సముద్రంలో బొప్పాయ్ పండు అంటూ ఆటపట్టించారు. వెరీ నైస్.. హుందాగా.. ఎంతో హ్యాండ్‌సమ్‌గా ఉంటాడు. అతని బాడీ లాంగ్వేజ్ అందరికీ ఇష్టపడుతుంది.

హైదరాబాద్‌లో మీ ఫ్లాట్ వివాదం సద్దమణిగినట్లేనా....?
యస్. ఈ విషయంలో మాత్రం మీడియాకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ ఫ్లాట్ తాలూకు వివరాలు మీడియా ద్వారా బహిర్గతమై నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచాయి. అంతేకాకుండా ఈ విషయంలో సబితా ఇంద్రారెడ్డి కేర్ తీసుకుని సమస్యను పరిష్కరించారు. ఇక్కడ నా స్థలం పక్కనే జేడీ చక్రవర్తి స్థలం కూడా ఉంది. కోర్టులో ఆయన స్థలముందంటూ ముందుకు రావడంతో సమస్య పూర్తిగా సాల్వ్ అయ్యింది.

మీ గ్లామర్ తగ్గలేదు.. రహస్యమేదైనా ఉందా....?
అబ్బో.. అంతేంలేదండి.. తిండి విషయంలో జాగ్రత్తలు పాటిస్తాను. దట్‌మీన్స్ కంట్రోల్‌గా వ్యవహరిస్తాను. ఈ మధ్యే జిమ్, యోగాలకు వెళుతున్నాను.

దేవుడిపై మీకు నమ్మకం ఉందా....?
నమ్ముతాను.. నా చిన్నతనంలో మా నాన్నగారు నన్ను ఇస్కాన్ దేవాలయానికి తరచూ తీసుకెళ్లేవారు. కృష్ణున్ని నేను తరచుగా పూజిస్తుంటాను.

పెళ్లి ఆలోచన చేస్తున్నారా..
ఇప్పట్లో అయితే లేదు. ఓ మూడేళ్ల తర్వాత అని అనుకుంటున్నాను.

ఇండస్ట్రీకి సంబంధించిన వారినే చేసుకుంటారా....?
నో ఛాన్స్.. ఇక్కడ అతి కొద్ది మంది మాత్రమే మంచి వారండి.. మిగిలిన హీరోలందరూ అలా కాదు. అయితే నాకు మాత్రం పెళ్లిపై నమ్మకమున్న వ్యక్తై ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారంలో నాకు తొడుగా నిలబడాలి.
<< 1 | 2 
మరిన్ని
సంతోషమే నా గ్లామర్ రహస్యం: సిమ్రాన్
మాస్ చిత్రాల్లో నటిస్తేనే నిలబడగలం: శ్రీకాంత్
"పరుగు" చిత్రానికి అభినందనలు స్వీకరిస్తా: 'దిల్' రాజు
కాలేజీకి చీరకట్టుకుని వెళ్తారా:..?! జెనీలియా
"నంది" వెనుక సమిష్టి కృషి: యువసామ్రాట్
పాత్రపై పవిత్ర భావనతో ఉండేవాళ్లం: అంజలీదేవి