ప్రధాన పేజి > వినోదం > వెండితెర > ముఖాముఖి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
'బ్లేడ్‌బాబ్జీ'తో జతకట్టిన సయాలీభగత్‌తో ముచ్చట్లు  Search similar articles
Sayalibagath
WD PhotoWD
బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు ల్యాండ్ అయిన మాజీ మిస్‌ ఇండియా వరల్డ్ 'బ్లేడ్‌బాబ్జీ'తో చిందులేస్తోంది. 'దిట్రైన్' చిత్రంతో తెరపై ప్రత్యక్షమైన ఈ సుందరి హిందీలో హల్లాబోల్, దిబ్లాక్-గాంధీ, గుడ్‌లక్ చిత్రాల్లో నటించింది. గతంలో మిలాన్,విల్స్ సిడ్నీ ఫ్యాషన్‌ షోలలో వయ్యారాలు ఒలకబోసిన ఈమె సోనీఎరిక్‌సన్ యాడ్‌లోనూ దర్శనమిస్తోంది. తెలుగుతెరకు కొత్తగా వచ్చింది కదాని సరదాగా పలకరిస్తే ఇదిగో తన గురించి ఇలా చెప్పింది.

మీ విద్యాభ్యాసం... ?
ముంబై యూనివర్సిటీలో బి.ఎం.ఎస్.,
మీ మాతృభాష, కుటుంబం... ?
గుజరాతీ... నాన్న దీపక్ భగత్ లీగల్ అడ్వైజర్, తల్లి నయాలీ భగత్, పదవతరగతి చదివే ఓ చిట్టి చెల్లెలు.
మీ ఎత్తు, బరువు... ?
5.8, 55 కేజీల బరువు.
మిస్ ఇండియాగా ఎప్పుడు ఎన్నికయ్యారు... ?
పదకొండో తరగతి చదివేటప్పుడు... 2004లో.
మీరు మోడలింగ్ చేశారా... ?
సోనీఎరిక్‌సన్, ఎల్.బి.ఫోన్లు, నారీ గార్మెట్స్, కిస్నా జ్యుయెలరీ లాంటి వాటికి మోడలింగ్ చేశాను.
నటనవైపు ఎలా వచ్చారు... ?
మోడలింగ్ చేస్తున్న సమయంలో యాక్టింగ్‌పై ఉన్న మక్కువతో వచ్చాను. ఇందుకోసం ముంబైలోని అనుపమ్‌ఖేర్ ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకున్నాను. అక్కడే రుతేష్ ఆచార్య వద్ద క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను.
తొలి సినిమా అవకాశం... ?
అనుపమ్‌ఖేర్ ఇన్సిట్యూట్‌లో ఉండగా ఇమ్రాన్ షహ్మి తన కొత్త చిత్రానికి హీరోయిన్ అన్వేషణలో భాగంగా నా ఫోటో చూచి ఎంపిక చేశారు.
ఇప్పటివరకు చేసిన చిత్రాలు... ?
హిందీలో హల్లాబోల్,గుడ్‌లక్ చిత్రాలు చేశాను. గుడ్‌లక్ జూన్ విడుదల కానుంది. ప్రస్తుతం పేయింగ్ గెస్ట్ అనే చిత్రం చేస్తున్నాను. దిబ్లాక్ అనే ఇంగ్లీష్ చిత్రంలోను నటించాను.
1 | 2  >>  
మరిన్ని
'పరుగు' చిరంజీవి కుటుంబానికి సంబంధించింది కాదు: భాస్కర్
డబుల్ హిట్‌తో 'జల్సా' చేస్తున్న ఇలియానాతో ముచ్చట్లు
ఎర్ర సినిమాలకు చిరునామా: నారాయణమూర్తితో కాసేపు
' రెడీ ' అంటోన్న శ్రీనువైట్లతో ఓ చిన్న ' ఢీ '
మంచి అమ్మగా నిలబడాలని ఆశిస్తున్నా: సాక్షి
సంతోషమే నా గ్లామర్ రహస్యం: సిమ్రాన్