''బ్లేడ్‌బాబ్జీ''తో జతకట్టిన సయాలీభగత్‌తో ముచ్చట్లు
|
మీ విద్యాభ్యాసం... ?
ముంబై యూనివర్సిటీలో బి.ఎం.ఎస్.,
మీ మాతృభాష, కుటుంబం... ?
గుజరాతీ... నాన్న దీపక్ భగత్ లీగల్ అడ్వైజర్, తల్లి నయాలీ భగత్, పదవతరగతి చదివే ఓ చిట్టి చెల్లెలు.
మీ ఎత్తు, బరువు... ?
5.8, 55 కేజీల బరువు.
మిస్ ఇండియాగా ఎప్పుడు ఎన్నికయ్యారు... ?
పదకొండో తరగతి చదివేటప్పుడు... 2004లో.
మీరు మోడలింగ్ చేశారా... ?
సోనీఎరిక్‌సన్, ఎల్.బి.ఫోన్లు, నారీ గార్మెట్స్, కిస్నా జ్యుయెలరీ లాంటి వాటికి మోడలింగ్ చేశాను.
నటనవైపు ఎలా వచ్చారు... ?
మోడలింగ్ చేస్తున్న సమయంలో యాక్టింగ్‌పై ఉన్న మక్కువతో వచ్చాను. ఇందుకోసం ముంబైలోని అనుపమ్‌ఖేర్ ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకున్నాను. అక్కడే రుతేష్ ఆచార్య వద్ద క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను.
తొలి సినిమా అవకాశం... ?
అనుపమ్‌ఖేర్ ఇన్సిట్యూట్‌లో ఉండగా ఇమ్రాన్ షహ్మి తన కొత్త చిత్రానికి హీరోయిన్ అన్వేషణలో భాగంగా నా ఫోటో చూచి ఎంపిక చేశారు.
ఇప్పటివరకు చేసిన చిత్రాలు... ?
హిందీలో హల్లాబోల్,గుడ్‌లక్ చిత్రాలు చేశాను. గుడ్‌లక్ జూన్ విడుదల కానుంది. ప్రస్తుతం పేయింగ్ గెస్ట్ అనే చిత్రం చేస్తున్నాను. దిబ్లాక్ అనే ఇంగ్లీష్ చిత్రంలోను నటించాను.
మీలో మీకు నచ్చని అంశం... ?
ఎవరినైనా ఇట్టే నమ్మేయడం.
మీ ప్లస్ పాయింట్స్... ?
దేనినైనా నిశితంగా పరిశీలిస్తా. చెప్పిన విషయాన్ని వెంటనే పసిగట్టేస్తా.
తల్లితండ్రుల ప్రోత్సాహం... ?
చాలా వుంది. అయితే ప్రయాణాలతోనే టైమ్ సరిపోతోంది. అందువల్ల ఒక్కోసారి కుటుంబాన్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది.
బ్లేడ్‌బాబ్జీలో మీ పాత్ర... ?
నాటీగల్... హీరోను చాలా సందర్భాల్లో ఏడ్పిస్తాను.మిగతా విషయాలు తెరపై చూడాల్సిందే.
హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు... ఇక్కడ మీరు గమనించిన అంశాలు... ?
త్వరలో తమిళంలో కూడా నటించబోతున్నాను. ఎక్కడైనా కామన్‌గా ఉంది. ఎక్కడైనా కామెడీ చిత్రాలకు ఆదరణ ఉంది.
గుజరాతీ, మరాఠీ బాషల్లో ఆఫర్ల సంగతి... ?
చేస్తే వచ్చేవి. బయటి చిత్రాల వల్ల అక్కడ నటించలేకపోతున్నా.
మీ హాబీలు... ?
చదవడం, స్విమ్మింగ్.
మిస్ ఇండియా కాకపోయి ఉంటే... ?
కాలేజీలో ఎంజాయ్ చేస్తుండేదాన్ని.
పెళ్లిపై మీ అభిప్రాయం... ?
మంచి అభిప్రాయం. కాబోయేవాడు స్పోర్ట్స్‌మెన్, బిజినెస్‌మెన్ అయివుండాలి.
పిల్లలంటే మీకు ఇష్టమా... ?
చాలా ఇష్టం. నాకు నలుగుర్ని కనాలనుంది.
హిందీలో ఎక్స్‌పోజింగ్‌పై మీ అభిప్రాయం... ?
హిందీలో ఎక్కువే. అయితే కథ మేరకే ఏదైనా.
