గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ముఖాముఖి » విజయం కోసం రిస్క్ అవసరం : నితిన్
ముఖాముఖి
Feedback Print Bookmark and Share
 
WD
ప్రశ్న... 8 ప్యాక్ కోసం ప్రత్యేక శిక్షణ ఏమన్నా తీసుకున్నారా?
జ.. ఇందుకోసం ఏడాదిపాటు కష్టపడ్డాను. బాడీ బిల్డింగ్ ట్రైనర్స్ సలహాల మేరకు డైట్ తీసుకున్నాను. రోజుకు మూడు గంటలపాటు వ్యాయామం చేసేవాడిని. ఈ వ్యాయామంలో ఒకటిన్నర గంట వెయిట్స్, మిగిలిన సమయంలో అబ్‌డమోల్ చేసేవాడిని.

ప్రశ్న... ఇంత రిస్క్ అవసరమా?
జ... ఇప్పుడంతా పోటీ యుగం. రిస్క్‌తీసుకోకపోతే ప్రత్యేకత ఉండదు. విజయం కావాలంటే కొంతైన రిస్క్ తీసుకోవాల్సిందే.

ప్రశ్న... సామాజిక సమస్యనే ఎంచుకోడానికి కారణం?
జ... ఇంతవరకు ప్రేమకథా చిత్రాలు, యాక్షన్ నేపథ్యంలో ఉన్న చిత్రాల్లో నటించాను. దర్శకుడు రవి సి.కుమార్ ఒక ప్రేమకథను, ఈ సినిమా కథను వివరించారు. ఇప్పటి ట్రెండ్‌ను బట్టి ఇది కరెక్ట్ అని భావించి, ఆ కథాంశంతో కూడిన చిత్రంలో నటించాను.

ప్రశ్న... అందులో మీకు బాగా నచ్చిన అంశం?
జ.. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంది. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటూ ప్రేక్షకుడికి ఊహకందని విధంగా ఉంటుంది. పతాక సన్నివేశంలో అరగంట థ్రిల్‌కు గురిచేస్తుంది. ప్రేక్షకుల నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి.

ప్రశ్న... మీ తదుపరి చిత్రాలు?
జ.. ప్రస్తుతం డి.ఎస్. రావు నిర్మిస్తోన్న "ద్రోణ"లో నటిస్తున్నాను. మన్యం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జీవీ దర్శకత్వంలో "హీరో" అనే చిత్రంలోనూ చేస్తున్నాను. మరో రెండు చిత్రాలు కమిట్ అయ్యాను.