1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
  4. కత్రినా... సల్మాన్ చెంపదెబ్బ ఇచ్చాడా...?

కత్రినా... సల్మాన్ చెంపదెబ్బ ఇచ్చాడా...?

కత్రినాకైఫ్ సల్మాన్ చెంపదెబ్బ బాలీవుడ్ సినిమా వార్తలు

Q. అక్షయ్‌తో నటించొద్దని సల్మాన్ అన్నాడని వార్తలొచ్చాయి. మీరేమంటారు?

A. ఒఠ్ఠి అబద్దం. పుకార్లంటే పడిచచ్చేవాళ్లు లేవనెత్తిన మాటలివి. అసలు నేను నటించే ప్రతి సినిమాకు... ప్రత్యేకించి అక్షయ్‌తో నటించే చిత్రాలకి సంబంధించి నన్ను మరింత ప్రోత్సహిస్తాడు. ఓ విషయం తెలుసా 'సింగ్ ఈజ్ కింగ్' చిత్రంలో నటించి తీరాలని అతనే నాకు సలహా ఇచ్చాడు.

IFM

Q. అక్షయ్‌తో కలిసి ఫోటోలో కనిపించినందుకు సల్మాన్ మీకు చెంపదెబ్బ ఇచ్చాడని ఇటీవల ఓ చానల్‌లో వచ్చింది. ఏమంటారు..?

A. అదో పనికిమాలిన వార్త. నన్ను కొట్టే ధైర్యం ఎవరికీ లేదు. అసలా ఫోటో గురించి నేను పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు. పైగా ఇంతవరకూ దీనిపై మేము చర్చించుకోలేదు.
IFM

Q. అదిసరే... మీ ఇద్దరూ ఎడమొఖం.. పెడమొఖంగా ఉన్నారని వార్తలొస్తున్నాయిగా...?

A. మరీ వ్యక్తిగతమైన అంశాలకు సమాధానం చెప్పడం కష్టం.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT