1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
  4. నన్ను చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలి: బిపాస

నన్ను చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలి: బిపాస

బాలీవుడ్ సెక్సీ తార బిపాస అగ్రశ్రేణి దర్శకులు

బాలీవుడ్ సెక్సీ తార బిపాస తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తనపై వచ్చే గుసగుసలను అసలు పట్టించుకోననీ, ఎవరో ఏదో అనుకుంటారనీ, తన సన్నిహితులను( సహ నటులను) వదిలిపెట్టనని చెపుతోంది. ఆమె నటించిన "బచ్చే ఏ హసీనా" విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆమెతో TWF(Trans World Feautures) మాటామంతీ...


Q. మీరు ఏదో టెన్షన్‌లో ఉన్నట్లున్నారు...?
A. అదేమీ లేదు. నేను నటించిన మరో భారీ చిత్రం విడుదలకానుంది. ఆ ఉత్సాహంలో ఉన్నాను. అంతే.... అగ్రశ్రేణి దర్శకులు యాష్ రాజ్ దర్శకత్వంలో నటించిన చిత్రం విడుదలవుతుందంటే ప్రేక్షకులలో సహజంగానే భారీ అంచనాలు నెలకొంటాయి.

Q. అన్నట్లూ... మీరు నటించిన యాష్ రాజ్ "ధూమ్- 2" కూడా బాక్సాఫీసును బద్దలు కొట్టిందిగా... అదే రేంజ్‌లో ఈ చిత్రం ఉంటుందనుకోవచ్చా?
A. భారీ బ్యానర్‌లో రూపుదిద్దుకున్న చిత్రాలపై సహజంగానే భారీ అంచనాలు నెలకొంటాయి. ఖచ్చితంగా ఈ చిత్రం అద్భుతం సృష్టిస్తుందనుకుంటున్నాను.

Q. ఎటువంటి చిత్రాల్లో నటించడానికి మీరు ఇష్టపడతారు...?
A. మాగ్జిమమ్ రొమాంటిక్ చిత్రాలకే నేను ప్రాధాన్యతనిస్తాను. ఈ ఏజ్‌లో అటువంటి పాత్రలలో నటిస్తేనే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఏడుపుగొట్టు పాత్రలను చేస్తే ఎవరు చూస్తారు. అంతెందుకు నన్ను మీరు ఏడుపు పాత్రల్లో చూడగలరా...?
FileTWF

Q. బచ్చే ఏ హసీనా చిత్రంలో మీరు పోషిస్తున్న "రాధిక" ఎలా ఉంటుంది.
A. ఆది నుంచి అంతం వరకూ అంతా గ్లామర్...

Q. అంటే "రేస్" చిత్రంలోని పాత్రలా ఉంటుందా...?
A. నేను నటించిన పాత్రలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. ఇది వెరైటీగా ఉంటుంది.

Q. రణబీర్‌తో నటించారు కదా... ఆ అనుభవం ఎలా ఉంది.
A. ఓహ్... మాటల్లో చెప్పలేను. అతను చాలా గొప్ప వ్యక్తి. అతనితో కలిసి చిత్రం చేయడం నాకు చాలా సంతృప్తినిచ్చింది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT