1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

అదే... నా పుట్టినరోజు సెలబ్రేషన్ : నాగార్జున

వినోదం వెండితెర ముఖాముఖి కొత్తదనం పుట్టినరోజు సెలబ్రేషన్ నాగార్జున
WD
కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ... న్యూటాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న కథానాయకుడు అక్కినేని నాగార్జున. అటు ఆధ్యాత్మిక చిత్రాల్లోనూ నటించి మెప్పిస్తూ విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకుంటున్నారన్నది.. అక్షర సత్యం. అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మాస్ తాజాగా "కింగ్"గా రాబోతున్నారు.

శ్రీను వైట్ల దర్శకత్వంలో ఢీ, హలో బ్రదర్స్ కలిస్తే ఎలా ఉంటుందో... ఈ చిత్రం కూడా అలాగే ఉంటుందని చెబుతున్నారు. తన కుమారుడు "నాగచైతన్య" ఈ ఏడాది హీరోగా పరిచయం చేయడం తన పుట్టినరోజు సెలబ్రేట్‌గా భావిస్తున్నానంటున్నారు. కామాక్షీ మూవీస్ అధినేత డి. శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తోన్న "కింగ్" చిత్రాన్ని డిసెంబర్ 18న విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్న నాగార్జునకు ఈ నెల 29న (శుక్రవారం) పుట్టిన రోజు. ఈ సందర్భంగా "నాగ్" ప్రత్యేక ఇంటర్వ్యూ...

ప్రశ్న.... చాలా సంతోషం కనబడుతున్నారు.. కారణమేమిటి?
జ... ఈ ఆనందానికి కారణం నాగచైతన్యను ఈ సంవత్సరం హీరోగా పరిచయం చేయడమే. అది తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది.

ప్రశ్న... చైతన్యన ఎటువంటి హీరోగా చూపించాలనుకుంటున్నారు?
జ... తను అన్ని చిత్రాలు చేయాలి. చేయగలగాలి. అప్పుడే కెరీర్ బాగుంటుంది. ముందుగానే మాస్ ఇమేజ్ క్రియేట్ చేయకుండా నిదానంగా ఎదగాలని ఆశిస్తున్నా... అప్పుడే నటునిగా గుర్తింపు లభిస్తుంది.

ప్రశ్న... దిల్‌రాజు ద్వారా పరిచయం చేయడానికి కారణం?
జ... మా బ్యానర్‌లోనూ చేయవచ్చు. కానీ దిల్‌రాజు అయితే ఇంకా బాగా ప్రెజెంట్ చేయగలడని నమ్మకం. తను చేసిన సినిమాలన్నీ మంచి సబ్జెక్ట్‌తో పాటు టాలెంటెడ్ డైరక్టర్స్‌తో సక్సెస్ మూవీలు అందించారు. యూత్‌ఫుల్ చిత్రాలను ఆయన చక్కగా ప్రెజెంట్ చేయగలడు.

ప్రశ్న... వయస్సు పెరిగినా స్మార్ట్‌గా కనిపించడానికి కారణం?
జ... అందం అనేది నాకు నాన్నగారి నుంచి వచ్చింది. దానికోసం ప్రత్యేకశ్రద్ధ అంటూ ఏమీ లేదు. అందరూ ఎప్పుడూ నవ్వుతూ ఉంటాం అదే మా సీక్రేట్.

ప్రశ్న... "వేమన" ఎప్పుడు చేయబోతున్నారు?
జ... ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ విషయంలో ఎటువంటి ఇంట్రెస్ట్ నాకులేదు. భవిష్యత్‌లో అది సాధ్యపడుతుందేమో..?

WD
ప్రశ్న..."కింగ్"లో మూడు షేడ్స్ ఏ తరహాలో ఉంటాయి?
జ... క్రెడిట్ కార్డ్ కలెక్షన్లు చేసే పాత్ర ఒకటి. టైటిల్ రోల్ రెండోవది. బొట్టి శ్రీను మూడవది. చూస్తేనే.. వాటి సస్పెన్స్ తెలుస్తుంది.

ప్రశ్న... టైటిల్ "కింగ్" అని పెట్టడానికి కారణం?
జ... ఆ మధ్య కొన్ని వెబ్‌సైట్లలో "కింగ్" అనే టైటిల్‌ను రాశాయి. ఆ టైటిల్ పాపులర్ అయింది. బాగుందని అందరూ చెప్పారు. పైగా కథక్కూడా దగ్గరగా ఉండటంతో పెట్టాల్సి వచ్చింది.

ప్రశ్న... ప్రత్యేకంగా మీ ఏ తరహా పాత్రలు ఇష్టపడతారు?
జ... ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలంటే ఇష్టం. ఆ తర్వాత యాక్షన్ మూవీస్. అంటే జేమ్స్‌బాండ్ తరహా చిత్రాలను చేయడంపై ఆసక్తి.

ప్రశ్న.... అంటే కింగ్... జేమ్స్‌బాండ్ తరహాలో ఉంటాడా?
జ.... కింగ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది... యాక్షన్‌ ఉంది. అలాగని జేమ్స్‌బాండ్ చిత్రం కాదు.

ప్రశ్న... ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు?
జ... అన్నీ అనుకూలిస్తే... డిసెంబర్ 18న విడుదల చేయాలనుకుంటున్నాం.. ఎందుకంటే... క్రిస్‌మస్‌కు ముందు, సంక్రాంతి లోపు ఎంటర్‌టైన్‌మెంట్‌కు సరైన కాలం.

ప్రశ్న... ఈ ఫీల్డ్‌లో మీరు బోర్‌గా ఫీలయిన సందర్భాలున్నాయా?
జ... కలుగుతుంది. టైమ్ సరిగ్గా సెట్‌కాకుండా సీన్స్ తీసేటప్పుడు... ముఖ్యంగా నిర్మాతలకు, దర్శకులకు, నటులకు మధ్య సమన్వయం లోపించినప్పుడు... అలాగే కొన్నిసార్లు ప్రైవసీని కోల్పోయానని బాధకూడా కలుగుతుంది. హీరోగా అన్నీ ఎదుర్కోవాలి కదా...

ప్రశ్న... దేవీశ్రీ ప్రసాద్‌తో మ్యూజిక్ చేయడానికి కారణం?
జ... అతను మంచి మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. మన్మథుడు, మాస్ చిత్రాలు మ్యూజికల్‌గా హిట్టయ్యాయి. శ్రీనువైట్లతో "రెడీ"కి హిట్ ఇచ్చాడు. నాతో ఇది హ్యాట్రిక్ సినిమా అవుతుంది. ఈ మధ్యకాలంలో "జల్సా"కు మంచి సంగీతాన్ని సమకూర్చాడు.

ప్రశ్న... నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించారు. మరి మీరు..?
జ... తప్పకుండా నాకు ఎంతో చేయాలని ఉంది. అందుకే అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్ర నిర్మాణానికి అవసరమైన అన్ని విధానాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాను. దానితో పాటు ఫిలిం స్కూల్‌ కూడా ప్రోగ్రెస్‌లో ఉంది. వీటి వివరాలు త్వరలో తెలియజేస్తా..!

ప్రశ్న... సన్నిహిత మిత్రుడు రాజకీయాల్లోకి వచ్చారు. మీకూ ఆలోచన ఉందా?
జ... మా కుటుంబానికి రాజకీయాలంటే పడవు. నా విషయంలో వాటికి ఎంతమాత్రం ఆసక్తిలేదు. రాజకీయ పరిజ్ఞానం నా విషయంలో శూన్యం. చిరంజీవిగారు పార్టీ పెట్టారు. మంచిదే... ఆయన రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటున్నాను.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT