ఈ ఆల్బమ్ మేము వినడానికి ఎంత కాలం పట్టవచ్చో తెలుపండి.... నా వెర్షన్ కూడా ఇంకా రికార్డ్ చేయాలి కాబట్టి ఇంకా చాలా పని మిగిలే ఉంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పని చాలా చేయాల్సి ఉంది. అది ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేను కానీ.. తప్పకుండా విడుదల అవుతుంది.
మిథున్ చక్రవర్తి లేదా అనిల్ కపూర్ వీరిలో ఎవరు మంచి గాయకులు మరి.. ఇరువురూ మంచి గాయకులే. చివరకు బోమన్ ఇరానీ కూడా మేటి గాయకుడే. గతంలోనూ తాను పాడగా ఒకటి రెండు సార్లు విన్నాను కాబట్టి అనిల్ మంచి సింగర్. ఇక పోతే మిథున్ చక్రవర్తికి ఇప్పటికీ శక్తి ఉంది. పాట పాడాలని నేను కోరినప్పుడు అతడు చూపిన ఆసక్తికి నేను ఆశ్చర్యపోయాను మరి.
ఈ ప్రాజెక్టును ఇంకా ముందే తీసుకు వచ్చి ఉంటే బాగుండేది మీరు భావించడం లేదా? అవును నా అభిప్రాయం కూడా ఇదే.. చాలామందిని నేను కోల్పోయాను. పాడగలవారిలో చాలామంది ఇప్పుడు ఇక్కడ లేరు. మా కాలంలో మేటి గాయకులుగా కూడా మారిన నటులు ఉండేవారు.
అంటే మీరంటున్నది కిషోర్ కుమార్ గురించేనా? ఆయన ఒక మహామేధావి మరియు మంచి స్నేహితుడు. అశోక్ కుమార్ కూడా మంచి గాయకుడే. రాజ్ కపూర్ షమ్మీ కపూర్ కూడా మంచి గాయకులే. జీవన్ జ్యోతిలో నేను షమ్మీ కపూర్‌తో ఒక పాటకు ప్లేబ్యాక్ పాడాను. ఆ రోజులే వేరు.
మీరు ఎన్నటికీ మంచి సంగీతం మధ్యనే జీవించారు. ఇప్పటికీ మీరు పాడగలుగుతున్నారు. అయితే మీ పిల్లలు ఈ వృత్తిలోకి రానందుకు మీరు ఎప్పుడూ బాధపడలేదా.. (క్షణం పాటు ఆలోచించి)... నేను వారిని ఆదేశించాను.. నా సలహాకు వారు కట్టుబడినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నాతోపాటు రికార్డింగ్ స్టూడియోకు కానీ సినిమా సెట్స్‌లోకి కానీ రావద్దని వారికి చెప్పాను. ఎందుకంటే అంత చిన్న వయసులో వారిపై భారం రుద్దరాదని భావించాను. అలా ఎప్పుడూ జరగలేదు కూడా.
ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా పాడుతున్నట్లు లేదు... ఎందుకంటే నా షరతుల ప్రకారమే నేను పాడుతున్నా కాబట్టి...
అయితే మీరు ఇంకా అనేక లైవ్ షోలను చేస్తున్నట్లుందిగా.. అవును... భారత్‌లోనూ అమెరికాలోనూ కూడా చాలానే చేస్తున్నాను. నా పని శైలి ఎప్పుడూ వేరుగానే ఉంటోంది. లతా దీదీతో కూడా ఇలాగే ఉంటుంది. నేను లైవ్ షోలను చేసేటపుడు నేను చెప్పినట్లే జరగాలి. స్టేజ్‌పై గందరగోళం నాకు ఇష్టం లేదు. అది నేను చేస్తున్న షో కాబట్టి, ప్రజలకు వినోదాత్మక విషయాన్ని సమర్పించాలని నాకు తెలుసు. నా సంగీత వాయిద్యకారులు కూడా నేను చెప్పింది పాటిస్తారు. నా పనిలో ఎవరి జోక్యాన్ని నేను సహించను కాబట్టి నా షోలో ఎవరూ జోక్యం చేసుకోరు మరి..